బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో ఈ ఏడాది బాలీవుడ్ కు బ్లాస్టింగ్ ఓపెనింగ్ ఇచ్చాడు. చాలా గ్యాప్ తరువాత వచ్చిన షారుఖ్ కు ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ప్రస్తుతం జవాన్ అనే సినిమాతో రాబోతున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ పై పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నట్టు పలు కథనాలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ను మొదట జూన్ 2వ తేదీన రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఆ తరువాత జూన్ ఎండింగ్ కు మార్చారు. ఇప్పుడు అది కూడా మారింది. తాజాగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రబృందం. సెప్టెంబర్ 7వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వల్ల ఈసినిమా రిలీజ్ డేట్ వాయిదా వేసినట్టు తెలుస్తుంది.
#Jawan #7thSeptember2023 pic.twitter.com/b0sOsSTSay
— Red Chillies Entertainment (@RedChilliesEnt) May 6, 2023
కాగా ఈసినిమాలో షారుక్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఒకటి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా.. మరొకటి గ్యాంగ్‌స్టర్‌గా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ఈసినిమాలోనయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగి బాబు, సునీల్ గ్రోవర్ కూడా పలు పాత్రల్లో నటిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గౌరీఖాన్ నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























