సలార్ పాత్రపై జగపతిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

jagapathi babu about his role in salaar movie

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాలు చేసిన జగపతిబాబు.. సెకండ్ ఇన్నింగ్స్ తరువాత మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే ఈ ఫేజ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. తెలుగు లో సలార్, పుష్ప 2, మహేష్ బాబు సినిమా లాంటి పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తూనే మరోపక్క పలు భాషల్లో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన రామబాణం సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈనేపథ్యంలో ఆయన కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసందర్భంగా ఆయన సలార్ సినిమా గురించి పలు ఆసక్తిర విషయాలు తెలియచేశారు. నిజానికి సలార్ సినిమాలో నా క్యారెక్టర్ గురించి ఇంకా పూర్తిగా తెలియదు.. కేవలం ఒక్క సీన్ లో మాత్రమే ఒక ఐదు రోజులు నటించా.. స్కిల్డ్ డైరెక్టర్ అయినప్పుడు కథ ఏంటి.. నాపాత్ర ఏంటి అనే విషయాల గురించి నేను అంత పట్టించుకోను.. కేవలం షూటింగ్ ప్రతిరోజును ఎంజాయ్ చేస్తుంటాను.. ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎంత లెంగ్తీ అండ్ టఫ్ షాట్స్ అయినా వన్ టేక్ లో అప్రూవ్ చేయగలిగే క్లారిటీ ఉన్న డైరెక్టర్ అని తెలిపాడు జగపతిబాబు.

కాగా శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న రామబాణం సినిమాలో గోపీచంద్ హీరోగా నటిస్తుండగా జగపతిబాబు అన్నయ్యగా నటిస్తున్నాడు. ఈసినిమాలో ఇంకా ఖుష్బూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈసినిమా మే 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =