
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 75


భారీ ప్రమోషన్స్ లో శాకినీ ఢాకిని

సుదీప్ కోటికొక్కడు 3 మూవీ రిలీజ్ డేట్

అభిరామ్ అహింస షూటింగ్ పూర్తి

ఫ్యాన్స్ కోసం బ్రహ్మాస్త్ర స్పెషల్ ప్రీమియర్స్

బిగ్ బీ అమితాబ్ కు పెద్ద అభిమానిని - ఎన్టీఆర్

బిగ్ బాస్ 6 డే1 హైలెట్స్

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ట్రైలర్ రిలీజ్

వినాయక నిమజ్జన వేడుకలో అల్లు అర్జున్ , అర్హ

సరికొత్త టెక్నాలజీ 8Kతో సింహాసనం

బాలీవుడ్ హారర్ మూవీ లో సమంత ?

ఐదు భాషలలో దాస్ కా ధమ్కీ

బ్లాక్ బస్టర్ ఒక్కడు మూవీ రీ రిలీజ్ డేట్

నేను మీకు బాగా కావాల్సిన వాడిని రిలీజ్ డేట్ వాయిదా

ఘనంగా మొదలైన శర్వానంద్, రాశి ఖన్నా సినిమా

3D ఫార్మాట్ పనుల్లో బిజీగా ఆదిపురుష్

5 భాషల సినీ ప్రముఖుల వాయిస్ ఓవర్ తో పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ ట్రైలర్
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పొన్నియిన్…

భారీ ప్రమోషన్స్ లో శాకినీ ఢాకిని
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో కసాండ్రా మరియు నివేదా థామస్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ శాకినీ ఢాకిని మూవీ సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. దక్షిణ కొరియా యాక్షన్ కామెడీ చిత్రం మిడ్నైట్ రన్నర్స్ మూవీ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ కి మైకీ మేక్ క్లియరీ , నరేష్ కుమారన్ సంగీతం అందించారు.ఈ మూవీ లో యాక్షన్ సీన్స్ కై రెజీనా , నివేదా మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకొనడం విశేషం.శాకినీ డాకిని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఓటీటీ లోకి వచ్చేస్తున్న క్లాసిక్ ప్రేమకథ సీతారామం
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ , హీరోగా మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా రష్మిక మందన్న కీలక పాత్రలో వస్తున్న సినిమా సీతారామం. హనురాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథ ఆగష్ట్5 న రిలీజ్ అయిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. హను రాఘవపూడి కథ, స్క్రీన్ ప్లేతో పాటు విజువల్స్, ఎమోషన్స్ సిల్వర్ స్క్రీన్ పై అద్భుతం చేశాయి. చాలా నార్మల్ గా రిలీజ్ అయిన ఈసినిమాకు ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. ఇప్పటికే రూ. 80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకు మరింతగా ఆదరణ లభిస్తోంది. నార్త్ లో కూడా ఈసినిమాకు మంచి రివ్యూలు దక్కాయి. దీంతో అక్కడ కూడా ఈసినిమా మంచి…

అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ రికార్డ్ ను బ్రేక్ చేసిన బ్రహ్మాస్త్ర
స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ బ్రహ్మాస్త్ర హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా…

సుదీప్ కోటికొక్కడు 3 మూవీ రిలీజ్ డేట్
కన్నడ సూపర్ స్టార్ సుదీప్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను , డబ్బింగ్ వెర్షన్స్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే . హీరో సుదీప్ రీసెంట్ గా బ్లాక్ బస్టర్ విక్రాంత్ రోణ మూవీ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. హీరో సుదీప్ ఇప్పుడు మరో మాస్ &యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

అభిరామ్ అహింస షూటింగ్ పూర్తి
దగ్గుబాటి వారసత్వం నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రానా ఇప్పటికే టాలెంటెడ్ నటుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఎంతోమంది హీరోలు ఉన్నా... వారిలో రానాకు మాత్రం స్పెషల్ గుర్తింపు ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు రానా తమ్ముడు అభిరామ్ కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. అభిరామ్ హీరోగా తేజ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. అహింస అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది.

ఫ్యాన్స్ కోసం బ్రహ్మాస్త్ర స్పెషల్ ప్రీమియర్స్
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న భారీ సోషియో ఫాంటసీ అడ్వంచరస్ మూవీ బ్రహ్మాస్త్ర. ఈ సినిమాకోసం దేశం వ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అస్త్రావర్స్ అనే పేరుతో అస్త్రాల నేపథ్యంలో ఒక ఫాంటసీ వరల్డ్ ను క్రియేట్ చేసి దాని ద్వారా భారతీయ సంస్కృతులు, పురాణాల సూర్తితో అస్త్రాల గురించి తెలియచేయనున్నాడు. విభిన్నమైన కథాంశంతో వస్తుంది కాబట్టే సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మరో మూడు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రయూనిట్ తమకు వీలైనంత మేర ప్రమోషన్స్ ను చేశారు. సౌత్ లో కూడా రణ్ బీర్, అలియా భట్ లాంటి బాలీవుడ్ స్టార్స్ రియాలిటీ షోస్ లో సైతం…

బిగ్ బీ అమితాబ్ కు పెద్ద అభిమానిని - ఎన్టీఆర్
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికమన్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఎన్టీఆర్ కు దేశవ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా .తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

బిగ్ బాస్ 6 డే1 హైలెట్స్
బిగ్ బాస్ సందడి మొదలైపోయింది. బుల్లి తెర ప్రేక్షకులకు మరో రెండు మూడు నెలలు ఫుల్ టైమ్ పాస్. ఇక సీజన్ సీజన్ కు కంటెస్టెంట్ లను పెంచుతూ వస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. గత సీజన్ లోనే 19 మంది కంటెస్టెంట్ లను బరిలోకి దింపిన స్టార్ మా ఈసారి 21మంది కంటెస్టెంట్ లను తీసుకువచ్చింది. ఇక ఎవరికి వారు సీజన్ టైటిల్ ను కొట్టాలన్న కసితోనే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ట్రైలర్ రిలీజ్
బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో యువ హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ సెప్టెంబర్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీనివాస్ అవసరాల , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సాగర్ సంగీతం అందించారు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, హీరో సుధీర్ బాబు కాంబినేషన్లో సమ్మోహనం , V మూవీస్ తరువాత తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

హిందీలో కార్తికేయ2 కలెక్షన్ల ప్రభంజనం
కొన్ని సినిమాలు భారీ అంచనాలతో, భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడం చూస్తూనే ఉంటాం.. అలానే కొన్ని సినిమాలు ఎలాంటి ప్రచారాలు లేకపోయినా.. కేవలం మౌత్ టాక్ తో బాక్సాఫీస్ బద్దలు కొట్టడం చూశాం. రీసెంట్ గా వచ్చిన కార్తికేయ2 సినిమా రెండో కోవలోకి వస్తుంది. షూటింగ్ సమయంలో కరోనా వల్ల వచ్చిన అవాంతరాలు.. ఆ తరువాత ఈసినిమా రిలీజ్ కు ముందు పలుమార్లు వాయిదా పడటం లాంటి పలు అడ్డంకులు వచ్చాయి. ప్రమోషన్స్ కు కూడా చాలా తక్కువ సమయం ఉండటంతో సౌత్ లో కొంతవరకూ బజ్ క్రియేట్ చేశారు కానీ.. నార్త్ లో అయితే అసలు ప్రమోషన్సే చేయలేదు. కానీ ఇప్పుడు ఈసినిమా నార్త్ లో ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో…

వినాయక నిమజ్జన వేడుకలో అల్లు అర్జున్ , అర్హ
బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ ఘనవిజయం సాధించి దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని అల్లు అర్జున్ క్రేజీ హీరోగా మారారు. సోషల్ మీడియాలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీటర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో 46.8 మిలియన్ ఫాలోవర్స్ తో నెంబర్ వన్ గా నిలిచారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప :ది రూల్ మూవీ…

సరికొత్త టెక్నాలజీ 8Kతో సింహాసనం
సూపర్ స్టార్ కృష్ణ హీరోగా భారీ బడ్జెట్ , తారాగణం తో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన సింహాసనం మూవీ కి భారత చలన చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై కృష్ణ దర్శకత్వంలో కృష్ణ హీరోగా తెరకెక్కిన సింహాసనం మూవీ లో జయప్రద , రాధ, మందాకినీ కథానాయికలు. సంగీత దర్శకుడు బప్పి లాహిరి స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్టీరియో ఫోనిక్ సౌండ్ తో తెరకెక్కిన ఫస్ట్ 70ఎం ఎం తెలుగు మూవీ గా సింహాసనం రికార్డ్ క్రియేట్ చేసింది.

బాలీవుడ్ హారర్ మూవీ లో సమంత ?
స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా తెరకెక్కిన యశోద, మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , సమంత జంటగా భారీ బడ్జెట్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఖుషి మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఒక హిందీ వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇస్మార్ట్ శంకర్ 2 స్క్రిప్ట్ పనుల్లో బిజీగా పూరి జగన్నాథ్ ?
పూరి కనెక్ట్స్ , పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ఇస్మార్ట్ శంకర్ మూవీ 2019 జూలై 18 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. నభా నటేష్ , నిధి అగర్వాల్ కథానాయికలు. పక్కా మాస క్యారెక్టర్ లో హీరో రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఇస్మార్ట్ శంకర్ మూవీ హీరో రామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ సీక్వెల్ ను తెరకెక్కించనున్నట్టు దర్శకుడు పూరి అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

ఐదు భాషలలో దాస్ కా ధమ్కీ
వెళ్ళిపోమాకే మూవీ తో హీరోగా పరిచయం అయిన విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది ?, ఫలక్ నుమా దాస్ , HIT – ది ఫస్ట్ కేస్ వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఫలక్ నుమా దాస్ మూవీ తో విశ్వక్ దర్శకుడిగా మారారు. విశ్వక్ సేన్ హీరో గా తెరకెక్కిన అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ ఘనవిజయం సాధించింది. యాక్టర్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ విశ్వక్ హీరోగా తెరకెక్కిన ఓరి దేవుడా మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

బ్లాక్ బస్టర్ ఒక్కడు మూవీ రీ రిలీజ్ డేట్
సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు ,భూమిక జంటగా భారీ బడ్జెట్ , సెట్స్ తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఒక్కడు మూవీ 2003 జనవరి 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. మహేష్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ 8 నంది , 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. “ఒక్కడు ” మూవీ తమిళ , కన్నడ , బెంగాలీ , హిందీ , ఒడియా , సింహళ భాషలలో రీమేక్ అయ్యి విజయం సాధించింది.ఈ మూవీ కై స్పెషల్ గా చార్మినార్ సెట్ ను రూపొందించడం విశేషం.

నేను మీకు బాగా కావాల్సిన వాడిని రిలీజ్ డేట్ వాయిదా
రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అందులో నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా కూడా ఒకటి. శ్రీధర్ గాదే దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇంకా రిలీజ్ కు చాలా తక్కువ రోజులు ఉండటంతో ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఇక మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. రీసెంట్ గానే ఈ సినిమా నుండి ఒక లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసింది చిత్రం బృందం. ” అట్టాంటి ఇట్టాంటి దాన్ని కాదు మావో” అంటూ సాగే ఈ మాస్ బీట్…

ఘనంగా మొదలైన శర్వానంద్, రాశి ఖన్నా సినిమా
శర్వానంద్, కృష్ణ చైతన్య, రాశి ఖన్నా, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నూతన చిత్రం వైభవంగా ప్రారంభం అయింది . ప్రామిసింగ్ హీరో శర్వానంద్ తన 33వ చిత్రం కోసం అత్యంత ప్రతిభ గల రచయిత, దర్శకుడు కృష్ణ చైతన్యతో కలసి పని చేస్తున్నారు. టాలీవుడ్ లో విజయవంతమైన నిర్మాతలలో ఒకరైన టిజి విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది.

3D ఫార్మాట్ పనుల్లో బిజీగా ఆదిపురుష్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో హీరో ప్రభాస్ నటించిన…