పూరి కనెక్ట్స్ , పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ఇస్మార్ట్ శంకర్ మూవీ 2019 జూలై 18 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. నభా నటేష్ , నిధి అగర్వాల్ కథానాయికలు. పక్కా మాస క్యారెక్టర్ లో హీరో రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఇస్మార్ట్ శంకర్ మూవీ హీరో రామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ సీక్వెల్ ను తెరకెక్కించనున్నట్టు దర్శకుడు పూరి అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూరి జగన్నాథ్ లైగర్ మూవీ షూటింగ్ తో బిజీగా ఉండటం , హీరో రామ్ ఇతర ప్రాజెక్ట్స్ కు కమిట్ అవడంతో ఇస్మార్ట్ శంకర్ 2 మూవీ డిలే అయ్యింది. పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , అనన్య పాండే జంటగా తెరకెక్కిన లైగర్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. లైగర్ మూవీ రిలీజ్ కాకుండానే విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాథ్ జన గణ మన మూవీ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మూవీ ని పక్కకి పెట్టి దర్శకుడు పూరి ఇస్మార్ట్ శంకర్ మూవీ సీక్వెల్ పై ఫోకస్ పెట్టినట్టు , స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నట్టు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: