సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు ,భూమిక జంటగా భారీ బడ్జెట్ , సెట్స్ తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఒక్కడు మూవీ 2003 జనవరి 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. మహేష్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ 8 నంది , 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. “ఒక్కడు ” మూవీ తమిళ , కన్నడ , బెంగాలీ , హిందీ , ఒడియా , సింహళ భాషలలో రీమేక్ అయ్యి విజయం సాధించింది.ఈ మూవీ కై స్పెషల్ గా చార్మినార్ సెట్ ను రూపొందించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ లో ప్రస్తుతం టాలీవుడ్ హీరోల పాత సూపర్ హిట్ మూవీస్ ను ఆధునిక టెక్నాలజీ తో రీ రిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. హీరోగా మహేష్ బాబు ఇమేజ్, స్టార్‌డమ్‌ను రెట్టింపు చేసిన సినిమాల్లో ఒక్కడు ఒకటి. ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీగా దర్శకుడు గుణశేఖర్ ఈసినిమాను తెరకెక్కించారు.ఇందులో కబడ్డీ ప్లేయర్‌గా మహేష్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అభిమానులను అలరించాయి. 2023 సంక్రాంతి సమయానికి ఈ సినిమా విడుదలై ఇరవై ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక్కడు సినిమాను 2023 జనవరి 8న ఒక్కడు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాత ఎం ఎస్ రాజు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. 4K లో వరల్డ్‌వైడ్‌గా స్పెషల్ షోస్ స్క్రీనింగ్ చేయబోతున్నట్లు గా నిర్మాత ఎం ఎస్ రాజు ట్వీట్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: