కొన్ని సినిమాలు భారీ అంచనాలతో, భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడం చూస్తూనే ఉంటాం.. అలానే కొన్ని సినిమాలు ఎలాంటి ప్రచారాలు లేకపోయినా.. కేవలం మౌత్ టాక్ తో బాక్సాఫీస్ బద్దలు కొట్టడం చూశాం. రీసెంట్ గా వచ్చిన కార్తికేయ2 సినిమా రెండో కోవలోకి వస్తుంది. షూటింగ్ సమయంలో కరోనా వల్ల వచ్చిన అవాంతరాలు.. ఆ తరువాత ఈసినిమా రిలీజ్ కు ముందు పలుమార్లు వాయిదా పడటం లాంటి పలు అడ్డంకులు వచ్చాయి. ప్రమోషన్స్ కు కూడా చాలా తక్కువ సమయం ఉండటంతో సౌత్ లో కొంతవరకూ బజ్ క్రియేట్ చేశారు కానీ.. నార్త్ లో అయితే అసలు ప్రమోషన్సే చేయలేదు. కానీ ఇప్పుడు ఈసినిమా నార్త్ లో ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో చూస్తున్నాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన ఈసినిమా ఆగష్ట్ 13న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. మొదట్లో చాలా పరిమిత థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్యాక్డ్ హౌస్‌లతో వావ్ అనిపిస్తోంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ అందిస్తుంది. తెలుగులో ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన ఈసినిమా.. హిందీలో కూడా ఎక్కడా తగ్గట్లేదు. చిన్న సినిమా రిలీజ్ అయిన కార్తికేయ2 బాలీవుడ్‌లో కూడా ఇంతటి ప్రభావం చూపుతుందని ఎవరూ ఊహించలేదు. ఈనేపథ్యంలో ఈసినిమా హిందీలో ఇప్పటివరకూ 35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ అంచనా వేస్తుంది. మరి ఈ శుక్రవారం బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమా బ్రహ్మాస్త్ర బరిలోకి దిగబోతుంది. చూద్దాం మరి ఆ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో.. కార్తికేయ 2 కలెక్షన్స్ కు బ్రహ్మాస్త్ర కలెక్షన్స్ కు బ్రేకులు ఏమైనా పడతాయేమో..
కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా.. అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ పతాకాల పై సంయుక్తం గా నిర్మించిన ఈసినిమాకు కాల భైరవ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: