అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న భారీ సోషియో ఫాంటసీ అడ్వంచరస్ మూవీ బ్రహ్మాస్త్ర. ఈ సినిమాకోసం దేశం వ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అస్త్రావర్స్ అనే పేరుతో అస్త్రాల నేపథ్యంలో ఒక ఫాంటసీ వరల్డ్ ను క్రియేట్ చేసి దాని ద్వారా భారతీయ సంస్కృతులు, పురాణాల సూర్తితో అస్త్రాల గురించి తెలియచేయనున్నాడు. విభిన్నమైన కథాంశంతో వస్తుంది కాబట్టే సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మరో మూడు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రయూనిట్ తమకు వీలైనంత మేర ప్రమోషన్స్ ను చేశారు. సౌత్ లో కూడా రణ్ బీర్, అలియా భట్ లాంటి బాలీవుడ్ స్టార్స్ రియాలిటీ షోస్ లో సైతం పాల్గొంటున్నారు అంటేనే అర్థంచేసుకోవచ్చు. ఈసినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని ఎంత ప్రయత్నిస్తున్నారో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా భారీ మొత్తంలోనే జరుగుతున్నాయి. ఈ సినిమా బుకింగ్స్ పరంగా సెన్సేషన్ ని నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు ఈసినిమా త్రీడీ వర్షన్ ను వీక్షిస్తున్నారు చిత్రయూనిట్. అయాన్ ముఖర్జీ, రణ్ బీర్ సింగ్, అలియా భట్ తో పాటు సినిమా క్రూ అందరూ స్పెషల్ షోను చూస్తున్నారు. ఈనేపథ్యంలో ఒక వీడియోను రిలీజ్ చేశారు. అందులో ఫ్యాన్స్ కోసం రిలీజ్ కు ఒక రోజు ముందు అంటే సెప్టెంబర్ 8వ తేదీన ప్రీమియర్ షోను నిర్వహిస్తున్నామని.. వారు కూడా ఫ్యాన్స్ తో చూస్తున్నామని.. ప్రస్తుతానికి ముంబైలో ఈ షో నిర్వహిస్తున్నామని.. పాజిబిలిటీ ఉంటే హైద్రాబాద్ లో కూడా ఈ షో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.
— Karan Johar (@karanjohar) September 6, 2022
కాగా ఈసినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అలానే నాగర్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న ఈ భారీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: