వరస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికమన్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఎన్టీఆర్ కు దేశవ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా .తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినీ ప్రేక్షకులకు అభిమాన తారలు ఉన్నట్టే సినీ ప్రముఖులకు కూడా అభిమాన తారలు ఉంటారని తెలిసిన విషయమే. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ .. లెజెండరీ యాక్టర్ బిగ్ బీ అమితాబ్ కు పెద్ద అభిమానిని అనీ , అమితాబ్ పై ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ .. అమితాబ్ జీ నటించిన ప్రతీ సినిమాలో ఆయన ఇంటెన్సిటీని బాగా ఎంజాయ్ చేస్తాననీ , ఆయన ఇంటెన్సిటీకి తాను పెద్ద అభిమానినీ , ఆయన వాయిస్, ఆయన కళ్లు, ఆయన నిలబడే విధానం, ఆయన నడక, ఎడమ చేయి తిప్పే విధానం, ఆయనకు సంబంధించిన ప్రతిదీ తనకు చాలా ఇష్టమనీ , ఒక యాక్టర్ గా తనపై ఆయన ఒక మార్క్ ని క్రియేట్ చేశారనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: