బిగ్ బాస్ సందడి మొదలైపోయింది. బుల్లి తెర ప్రేక్షకులకు మరో రెండు మూడు నెలలు ఫుల్ టైమ్ పాస్. ఇక సీజన్ సీజన్ కు కంటెస్టెంట్ లను పెంచుతూ వస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. గత సీజన్ లోనే 19 మంది కంటెస్టెంట్ లను బరిలోకి దింపిన స్టార్ మా ఈసారి 21మంది కంటెస్టెంట్ లను తీసుకువచ్చింది. ఇక ఎవరికి వారు సీజన్ టైటిల్ ను కొట్టాలన్న కసితోనే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 6 లో మొదటి రోజు గడిచిపోయింది. నిజానికి సోమవారం కాబట్టి నామినేషన్స్ ఉంటాయి అని.. ఆ హీట్ ను చూద్దామని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు కానీ ఫస్ట్ డే నామినేషన్స్ ను పెట్టలేదు. నామినేషన్స్ కూడా మొదలవ్వకుండానే ఒక్క రోజుకే కంటెస్టెంట్స్ మధ్య మంచి డ్రామా స్టార్ట్ అయ్యింది. అప్పుడే గొడవలు కూడా స్టార్ట్ అయిపోయాయి. కాదేదీ గొడవకు అనర్హం అన్నట్టుగా చిన్న విషయానికే కంటెస్టెంట్ లు గొడవలు పెట్టుకునెేలా కనిపిస్తున్నారు.
బాత్ రూం రచ్చ
మరోవైపు మొదటిరోజుతోనే ప్రేక్షకుల్లో నోటెడ్ అయిన కంటెస్టెంట్ గలాటా గీతు. తన యాసతో కాస్త బోల్డ్ గా మాట్లాడుతూ హంగామా చేసేసింది. బాత్రూంలో ఎవరివో వెంట్రుకలున్నాయంటూ.. ఎవరి హెయిర్స్ వాళ్లే తీయాలి అంటూ కాసేపు హడావుడి చేసింది. ఈ విషయం దగ్గర గీతాకు అలానే ఇనయ సుల్తాన్ కు మధ్య మాటల వాగ్వాదం కూడా జరిగింది. ఈనేపథ్యంలో ఇనయను గీతా తిక్కది అంటూ కూడా నోరు జారేసింది. ముందు ముందు వీరిద్దరి మధ్య గట్టి వారే నడిచేలా కనిపిస్తుంది.
క్లాస్-మాస్-ట్రాష్
ఫస్ట్ డే క్లాస్-మాస్-ట్రాష్ అనే టాస్క్ కంటెస్టెంట్స్ కు ఇచ్చాడు బిగ్ బాస్.
క్లాస్ టీమ్ ఉన్న మెంబర్స్ కు సర్వాధికారాలు ఉంటాయి.. కెప్టెన్సీ కంటెండర్ గా ఎలిజిబిలిటీ ఉంటుంది..నామినేషన్స్ ఉండవు.. వీఐపీ లాంజ్ వాడుకోవచ్చు.
ట్రాష్ టీమ్ కంటెస్టెంట్స్ ఇంటి పనులు అన్నీ వీరే చేయాల్సి ఉంటుంది. గార్డెన్ ఏరియాలో పడుకోవాలి.. కెప్టెన్సీ కంటెండర్ గా ఎలిజిబిలిటీ లేదు.. నేరుగా నామినేట్ అవుతారు.
మాస్ టీమ్ మెంబర్స్ కూడా ఎలాంటి అధికారాలు ఉండవు కానీ కెప్టెన్సీ కంటెండర్లకు మాత్రం నామినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఈ టాస్క్ గురించి తర్జన బర్జన అవుతూ ఫైనల్ గా ఓ డెసిషన్ కు వస్తారు. క్లాస్, ట్రాష్ కేటగిరి ఓట్లు వేస్తే మిగిలిన వారందరూ మాస్ కేటగిరిలోకి వెళ్లేలా ఒప్పందం చేసుకుంటారు. ఇక ఈ టాస్క్ లో బాలాదిత్య 6 ఓట్లతో, ఆర్జే సూర్య 5 ఓట్లతో, శ్రీహాన్ 4 ఓట్లతో క్లాస్ టీమ్ లోకి వచ్చారు. ఇక గీతూ చేసిన హడావుడి వల్ల 8 ఓట్లతో ట్రాష్ కేటగిరిలోకి వెళ్లింది. గీతూ తో పాటు రేవంత్ అలానే ఇనయ కూడా ట్రాష్ టీమ్ లోకి వెళ్లారు. ముందుగా అనుకున్నట్టు మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ మాస్ టీమ్ కి వెళ్లిపోయారు.
ఆ తరువాత మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎవరు గెలిస్తే వారు స్వాపింగ్ చేసుకునే అవకాశం. ఈ టాస్క్ లో ట్రాష్ టీమ్ నుండి ఇనయ, మాస్ నుండి ఆది రాగా.. ఆది గెలవడంతో స్వాపింగ్ ద్వారా క్లాస్ టీమ్ లోకి వెళ్లి.. క్లాస్ టీమ్ లో ఉన్న శ్రీహాన్ మాస్ టీమ్ లోకి వస్తాడు.
ఫైనల్ గా ట్రాష్ టీమ్ సభ్యులకు బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చాడు. మీరు ట్రాష్ టీమ్ లో ఉన్నంతమాత్రన ట్రాష్ కాదని… మీరు ఈ స్టేజ్ లో ఉంటడానికి ఇన్స్పిరేషన్ ఎవరో చెబుతూ వారి పేరు బాటిల్లో వేసి స్విమ్మింగ్ పూల్ లో వదలమని చెబుతాడు. ఈక్రమంలో ఇనయ తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అవుతుంది. రేవంత్ కూడా తన ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఈ స్టేజ్ లో ఉన్నానని.. తన ఫాలోవర్స్ వల్ల తను అందరికీ తెలిసిందని గీతూ చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
మరి డే1 అయితే కాస్త గొడవలు, టాస్క్, ఎమోషనల్ సాగింది. మరి డే2 ఎలా ఉంటుందో చూద్దాం..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: