అభిరామ్ అహింస షూటింగ్ పూర్తి

Abhiram's Ahimsa Movie Shoot Wrapped Up, Ahimsa Movie Shoot Wrapped Up, Abhiram Daggubati’s Ahimsa, Abhiram Daggubati and Director Teja's Ahimsa, Ahimsa Telugu Movie Shoot Wrapped Up, Abhiram's Ahimsa Movie, Ahimsa Movie Update, Ahimsa Telugu Movie Latest Update, Ahimsa, Ahimsa Telugu Movie, Abhiram's Ahimsa, Abhiram Daggubati, entire shoot of Ahimsa has been wrapped up, Director Teja, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

దగ్గుబాటి వారసత్వం నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రానా ఇప్పటికే టాలెంటెడ్ నటుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఎంతోమంది హీరోలు ఉన్నా… వారిలో రానాకు మాత్రం స్పెషల్ గుర్తింపు ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు రానా తమ్ముడు అభిరామ్ కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. అభిరామ్ హీరోగా తేజ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. అహింస అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా షూటింగ్ ను ఇటీవలే ప్రారంభించిన చిత్రయూనిట్ శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంది.ఇప్పటికే ఈసినిమా నుండి ప్రీ లుక్ ను రిలీజ్ చేయగా.. ప్రీ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.

కాగా ఈసినిమాలో గీతికా హీరోయిన్ గా నటిస్తుండగా.. అలాగే రజత్ బేడీ, సదా, రవి కాలే అలాగే కమల్ కామరాజు తదితరులు నటిస్తున్నారు. ఇంకా సముద్రఖని కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి.కిరణ్‌ నిర్మిస్తున్న ఈసినిమాకు ఆర్‌.పి.పట్నాయక్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను భారీ స్థాయిలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట మేక‌ర్స్. మరి మొదటిసినిమా అభిరామ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 12 =