డ్రైవర్ జమున కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

Driver Jamuna Release Date Fixed, Driver Jamuna Movie Release Date Fixed, Driver Jamuna Telugu Movie Release Date, Aishwarya Rajesh, Aadukalam Naren, Sriranjani, Ghibran, P Kinslin, Aishwarya Rajesh Latest Movie, Aishwarya Rajesh's Upcoming Movie, Driver Jamuna, Driver Jamuna Telugu movie, Driver Jamuna New Update, Driver Jamuna Telugu Movie New Update, Driver Jamuna Movie, Driver Jamuna Latest Update, Driver Jamuna Movie Updates, Driver Jamuna Telugu Movie Live Updates, Driver Jamuna Telugu Movie Latest News, Driver Jamuna Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కౌస‌ల్యాకృష్ణ‌మూర్తి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు దగ్గరైన ఐశ్వర్య రాజేష్ ఆతరువాత పలు సినిమాలు చేసింది. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తుంది. పా. కిన్స్లిన్ దర్శకత్వంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా వస్తున్న సినిమా డ్రైవర్ జమున. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ లను కూడా రిలీజ్ చేశారు కూడా. ఇవి సినిమాపై భారీ అంచనాలనే పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్ నవంబర్ 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా లేడీ క్యాబ్ డ్రైవర్ జీవితంలో చోటు చేసుకున్న నాటకీయ సంఘటనల నేపధ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఆడుకలం నరేన్, కవితా భారతి, అభిషేక్ కుమార్, ఇళయ పాండి, మణికందన్ రాజేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 18 రీల్స్ పై ఎస్.పి.చౌదరి నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి  గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రాఫర్ గా, ఆర్ రామర్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

మరి అదే రోజున తెలుగులో సమంత నటించిన యశోద సినిమా కూడా రిలీజ్ కానుంది. యశోద ఒక పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈరెండు సినిమాల్లో ఏ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − three =