హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా 180 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా నిలిచింది. యాక్షన్… థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఐఎండీబీ రేటింగ్ 9.6 సాధించి రికార్డు క్రియేట్ చేసింది. కాంతార మూవీ ఇతర భాషలన్నింటిలోనూ 60 కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా కాంతార మూవీ సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. అతి తక్కువ బడ్జెట్‌తో హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన కాంతార చిత్రం కర్ణాటకలోని హోంబలే ఫిల్మ్స్‌లో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా నిలిచింది. అంటే, ఈ మూవీ యష్ కేజీఎఫ్ చాప్టర్ 2 ద్వారా సృష్టించబడిన అత్యధిక ఫుట్‌ఫాల్స్ రికార్డ్‌ను కూడా అధిగమించింది. ఈ మూవీ మరెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: