దీపావళి పండగ సందర్భంగా న్యూ మూవీస్ పోస్టర్స్ రిలీజ్

Movie Posters Unveiled On The Occasion of Diwali, Occasion of Diwali, Varasudu, Sir, Ravanasura, Samantha's Yashoda, Samantha, Varalaxmi Sarathkumar Unni Mukundan, Hareesh Narayan, K. Hari Shankar, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Yashoda, Yashoda Telugu movie, Yashoda New Update, Yashoda Telugu Movie New Update, Yashoda Movie, Yashoda Latest Update, Yashoda Movie Updates, Yashoda Telugu Movie Live Updates, Yashoda Telugu Movie Latest News, Yashoda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ నవంబర్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.యశోద మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన యశోద మూవీ పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అభిషేక్ పిక్చర్స్ , ఆర్ టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ రావణాసుర మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ కథానాయికలు. సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్ , భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.2023 ఏప్రిల్‌ 7న ఈ చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రభు, శరత్ కుమార్ , యోగి బాబు , ప్రకాష్ రాజ్ , జయసుధ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో ధనుష్ , సంయుక్త మీనన్ జంటగా తెలుగు , తమిళ భాషలలో సార్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాయి కుమార్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

దీపావళి పండగ సందర్భంగా ఈ నాలుగు సినిమాల కొత్త పోస్టర్స్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.