విక్రమ్ 61 ట్రైటిల్ రిలీజ్

vikram 61 Movie Title Revealed, Chiyaan vikram 61 Movie, vikram 61 Movie Title, vikram 61 Thangalaan, vikram's Thangalaan, vikram 61 title, vikram 61 first look, vikram Latest Movie, vikram's Upcoming Movie, Chiyaan vikram, Parvathy Thiruvothu, Malavika Mohanan, Pa Ranjith, Thangalaan, Thangalaan Telugu movie, Thangalaan New Update, Thangalaan Telugu Movie New Update, Thangalaan Movie, Thangalaan Latest Update, Thangalaan Movie Updates, Thangalaan Telugu Movie Live Updates, Thangalaan Telugu Movie Latest News, Thangalaan Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

విభిన్నమైన కథలు ఎంచుకోవడంలో, డిఫరెంట్ పాత్రలు చేయడంలో విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడు. అందుకే విక్రమ్ సినిమా అంటే కేవలం అతని అభిమానులకు మాత్రమే కాదు.. సినీ ప్రేక్షకులు అందరికీ ఆసక్తి ఉంటుంది. ఇక ఈఏడాది కోబ్రా, పొన్నియన్ సెల్వన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు విక్రమ్. అయితే వీటిలో కోబ్రా సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా పొన్నియన్ సెల్వన్ మాత్రం తమిళ్ లో సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటికే 450 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఇప్పుడు విక్రమ్ తన తరువాత ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. విక్రమ్ కెరీర్ లో 61వ సినిమాగా ఈసినిమా తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇదిలా ఉండగా దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాకు తంగలాన్ టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. అలాగే, ఒక చిన్న గ్లింప్స్ ను విడుదల చేసారు మేకర్స్. ఈ వీడియో లో విక్రమ్ మరోసారి కొత్త గెటప్ తో వచ్చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు విక్రమ్ గాడిదలు కాసే కాపరి పాత్రలో వైల్డ్ అవతార్‌ లో అద్భుతంగా కనిపిస్తున్నాడు.

కాగా ఈసినిమాలో మాళవిక మోహనన్, పార్వతి తిరువొతు హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో పశుపతి ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. నీలం ప్రొడక్షన్స్ , స్టూడియో గ్రీన్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తుండగా. జి.వి.ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని త‌మిళంతో పాటు తెలుగు,హిందీ భాష‌ల్లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 1 =