సర్దార్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది

karthi about sardar movie success, Actor karthi about sardar movie success, sardar movie success, Karthi Latest Movie, Karthi's Upcoming Movie, Karthi, Laila, Raashii Khanna, Rajisha, PS Mithran, sardar, sardar 2022, sardar Telugu movie, sardar New Update, sardar Telugu Movie New Update, sardar Movie, sardar Latest Update, sardar Movie Updates, sardar Telugu Movie Live Updates, sardar Telugu Movie Latest News, sardar Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలను చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవాడు కార్తి. అందుకే వరుస హిట్లను అందిపుచ్చుకుంటున్నాడు. రీసెంట్ గానే విరుమన్ సినిమాతో హిట్ ను అందుకున్న కార్తి ఇప్పుడు సర్దార్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మిత్రన్ దర్శకత్వంలో కార్తి హీరోగా ఈసినిమా వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా మొదటి షో నుండి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరుపుకుంటున్నారు. ఈనేపథ్యంలో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు చిత్రయూనిట్. ఈసందర్భంగా కార్తి మాట్లాడుతూ.. మిత్రన్ ఈ సినిమాను చాలా గొప్పగా తెరకెక్కించాడు. ఒక మంచి సినిమాను చేయాలనే ఆశయంతో చేసిన సినిమా ఇది. నేను డైరెక్టర్ ను .. నేను చెప్పిందే మీరు చేయాలనే పద్ధతి మిత్రన్ లో కనిపించదు. ఒక సీన్ చేయడానికి ముందు దానిపై అందరి అభిప్రాయాలు అడిగి మరీ ఒక నిర్ణయానికి వస్తారు. ఈ సినిమాలో ప్రతి సీన్ గొప్పగా రావడానికి అదే కారణం. ఒక భారీ బడ్జెట్ సినిమాను చేయడం వేరు .. ఒక భారీకథను అందరికీ అర్థమయ్యేలా చెప్పడం వేరు. ప్రతి సీన్ ను ఒక సెటప్ తో .. ఇంట్రెస్టింగ్ గా చెప్పడం అంత తేలికైన విషయమేం కాదు. ‘సర్దార్’ లుక్ కీ .. అతని బాడీ లాంగ్వేజ్ కి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఖాకీ, ఖైదీ సినిమాల మాదిరిగానే ఈ సినిమాను కూడా ఆదరించి, కొత్తదనం ఉన్న సినిమాలను సక్సెస్ చేస్తామనే నమ్మకాన్ని మరోసారి కలిగించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు అంటూ తెలిపాడు.

కాగా ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో లక్ష్మణ్‌ కుమార్‌ ఈ సినిమాను నిర్మించారు. రాశీఖన్నా హీరోయిన్ గా నటించిన ఈసినిమాలో రజీషా విజయన్‌, లైలా, యోగి సేతు, మునీష్కాంత్‌, మాస్టర్‌ రిత్విక్‌, మురళీశర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాకు జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.