కన్పామ్ సంక్రాంతి బరిలో ఏజెంట్

Akhils Agent movie joins Sankranthi 2023 release race, Sankranthi 2023 release race, Akhils Agent movie, Akhils Agent Telugu movie, Agent Telugu movie, Mammootty, Akhil Akkineni, Mammootty, Sakshi Vaidya, Surender Reddy, Hiphop Tamizha, Akhil Latest Movie, Akhil's Upcoming Movie, Agent, Agent Telugu movie, Agent New Update, Agent Telugu Movie New Update, Agent Movie, Agent Latest Update, Agent Movie Updates, Agent Telugu Movie Live Updates, Agent Telugu Movie Latest News, Agent Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సంక్రాంతి వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గత రెండేళ్లలో కరోనా ప్రభావం వల్ల ఆ సందడి కాస్త తగ్గిందని చెప్పొచ్చు. అయినా కూడా ప్రేక్షకులను ఎలాగైనా అలరించాలని కొంతమంది మాత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. ఈ ఏడాది కాస్త ఎక్కువ సినిమాలో సంక్రాంతికి సందడి చేశాయి. ఇక ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా ఇప్పటినుండే చాలా సినిమాలు లైన్ కడుతున్నాయి. ఇప్పటికే ఆదిపురుష్ లాంటి భారీ బడ్జెట్ సినిమా సంక్రాంతి బరిలోకి దిగింది. దీనితో పాటు పలు సినిమాలు కూడా అప్పుడే సీటు రిజర్వేషన్ చేసుకుంటున్నాయి. తాజాగా మరో సినిమా ఆ లిస్ట్ లో చేరింది. ఆ సినిమా మరేదో కాదు అఖిల్ నుండి రాబోతున్న ఏజెంట్ సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్న సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి సినిమా అంటే అటు యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు స్టైయిలీష్ గా మేకింగ్ ఉంటుంది. దానికితోడు అఖిల్ మేకోవర్ కూడా పూర్తిగా మార్చేశాడు. అందుకే ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

కాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్ వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − five =