
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 37


బ్లాక్ బస్టర్ సీక్వెల్ పై బాలకృష్ణ క్లారిటీ

లైగర్ ఫెయిల్యూర్ పై విజయ్ రియాక్షన్

100 కోట్ల క్లబ్ లో సర్దార్

మావిరన్ మళ్లీ మొదలుపెట్టిన శివ కార్తికేయన్

కె జి ఎఫ్ చాప్టర్ 3 మూవీ పై హీరో యష్ స్పందన

హిట్ 2 ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

హైదరాబాద్ లో యశోద మూవీ కి భారీ కటౌట్

ప్రారంభం అయిన నాగశౌర్య కొత్త సినిమా షూటింగ్

హనుమాన్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

చరణ్ బ్యాక్.. #RC15 కొత్త షెడ్యూల్ అప్ డేట్
పుష్ప2 అస్సలు తగ్గేదేలే అంటున్న బన్నీ

పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ రిలీజ్ డేట్

2 మిలియన్ డాలర్స్ క్లబ్ లో కాంతార

రష్యాలో రిలీజ్ కానున్న పుష్ప :ది రైజ్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకుని…

బ్లాక్ బస్టర్ సీక్వెల్ పై బాలకృష్ణ క్లారిటీ
ప్రయోగాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చేసిన ప్రయోగమే ఆదిత్య 369. టైమ్ మెషీన్ బ్యాక్ డ్రాప్ తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన తొలి తెలుగు సినిమాగా బాలకృష్ణ సినీ కెరీర్లోనే కాదు, తెలుగు సినీ చరిత్రలోనూ మైలు రాయిగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.టైమ్ మిషన్, శ్రీ కృష్ణ దేవరాయలు కాలం సెట్టింగ్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. కృష్ణకుమార్‌గా, శ్రీ కృష్ణ దేవరాయలుగా ద్విపాత్రాభినయం చేసి తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈసినిమాను ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ను తెరకెక్కించాలని కూడా చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలాసార్లు ఈ సినిమాకు సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని…

లైగర్ ఫెయిల్యూర్ పై విజయ్ రియాక్షన్
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ అంటే ఆ క్రేజ్ వేరే ఉంటుంది కదా. అలాంటి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా లైగర్. అయితే ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మరోవైపు ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా బయ్యర్లు భారీ ధరకే రైట్స్ ను కొనుగోలు చేశారు. ఈసినిమా పరాజయంతో బయ్యర్లకు నష్టాలు వచ్చాయి. ఇక ఈనేపథ్యంలో పూరీ జగన్నాథ్ బయ్యర్లు మధ్య వివాదాలు కూడా తలెత్తాయి. ప్రస్తుతం అయితే ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది.

100 కోట్ల క్లబ్ లో సర్దార్
ప్రస్తుతం సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కోట్లలో కలెక్షన్స్ రాబట్టుకుంటున్నాయి. కథ బావుంటే, కాస్త ప్రయోగాత్మకంగా ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ఒకప్పటిలా కాకుండా ప్రస్తుత హీరోలు కూడా అలాంటి ప్రయోగాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక అలాంటి హీరోల్లో కార్తీ కూడా ముందుంటాడు. అందుకే ఈమధ్య అన్నీ వరుసగా హిట్లను సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గానే సర్దార్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మిత్రన్ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిలర్ గా వచ్చిన ఈసినిమా మంచి హిట్ ను అందుకుంది. కార్తీ రెండు పాత్రల్లో తన నటనతో ఆకట్టుకోవడం దానికి మించి కథ కథనాలు ఉండటంతో అందరినీ ఆకట్టుకుంది.

జపాన్ లో భారీ వసూళ్ళు సాధిస్తున్నఆర్ ఆర్ ఆర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ తో కాంతార
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మావిరన్ మళ్లీ మొదలుపెట్టిన శివ కార్తికేయన్
ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ పామ్ లో ఉన్నాడు శివ కార్తికేయన్. రీసెంట్ గానే అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ప్రిన్స్ సినిమా హిలేరియస్ హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు మళ్లీ పెండింగ్ లో ఉన్న తన కొత్త ప్రాజెక్ట్ లను పూర్తి చేసేందుకు సిద్దమవుతున్నాడు. శివకార్తికేయన్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో శివ కార్తికేయన్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమాతో పాటు మడోన్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు శివకార్తికేయన్.

అనుష్క 48వ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా అనుష్క ఎన్నో ఏళ్లపాటు కెరీర్ లో రాణించారు. ఇక లేడీ ఒరియెంటెడ్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ కూడా అనుష్కనే అన్నంత రేంజ్ కు ఎదిగిపోయింది. అయితే అనుష్క నుండి సినిమా వచ్చి చాలా రోజులే అయింది. చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వెయిట్ చేస్తున్నారు. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, లేటెస్ట్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇది అనుష్కకు 48వ సినిమా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక నేడు అనుష్క పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమాకు సంంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్…

వాల్తేరు వీరయ్య బాబీ సింహా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కె జి ఎఫ్ చాప్టర్ 3 మూవీ పై హీరో యష్ స్పందన
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1 కన్నడ మూవీ ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది, పాన్ ఇండియా స్టార్ గా మారారు. కె జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ సీక్వెల్ కె జి ఎఫ్ చాప్టర్ 2 కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి అన్ని భాషలలోనూ విజయం సాధించి, భారీ కలెక్షన్స్ రాబట్టింది. రవి బస్రూర్ సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1240 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ సక్సెస్ ను ఎంజాయ్…

హిట్ 2 ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్. ప్రస్తుతం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే హిట్2 సినిమా. ఈసినిమా హిట్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా హిట్. ఇప్పుడు విశ్వక్ సేన్ స్థానంలో అడివి శేష్ నటిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతోనే ఉన్నారు మేకర్స్.

హైదరాబాద్ లో యశోద మూవీ కి భారీ కటౌట్
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ నవంబర్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.యశోద మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు కన్నడ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

ప్రారంభం అయిన నాగశౌర్య కొత్త సినిమా షూటింగ్
సూపర్ హిట్ కామెడీ ఎంటర్ టైనర్ కృష్ణ వ్రింద విహారి మూవీ తో ప్రేక్షకులను అలరించిన యువ హీరో నాగశౌర్య మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. బేబీ అద్వైత , భవిష్య సమర్పణ లో వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ అరుణాచలం దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా భారీ బడ్జెట్ తో #NSN24 మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో నాగశౌర్య ఒక డిఫరెంట్ రోల్ , డిఫరెంట్ మేకోవర్ తో నటించనున్నారని సమాచారం.ఈ మూవీ కి హారిస్ జయరాజ్సంగీతం అందిస్తున్నారు.

హనుమాన్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
అ!, కల్కి, జాంబిరెడ్డి వంటి వినూత్న సినిమాలను తెరకెక్కించి టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీగా 'హనుమాన్' ను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జాంబిరెడ్డి సినిమా మంచి హిట్ అవ్వగా ఇప్పుడు ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా ఇన్ని రోజులు షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులలో భారీ అంచనాలు…

చరణ్ బ్యాక్.. #RC15 కొత్త షెడ్యూల్ అప్ డేట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. లెజెండరీ డైరెక్టర్, స్టార్ హీరో రామ్ చరణ్కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా శంకర్ కూడా ఆదే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. అయితే మధ్య మధ్యలో ఈసినిమా షూటింగ్ కు బ్రేకులు పడుతున్నాయి. దీనికి తోడు శంకర్ అటు చరణ్ ఇటు ఇండియన్ 2 సినిమాలను కూడా పార్లల్ గా చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.
పుష్ప2 అస్సలు తగ్గేదేలే అంటున్న బన్నీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో తగ్గేదేలే అంటూ తన మార్క్ డైలాగ్ తో పాన్ ఇండియా మార్కెట్ లో తన సత్తా చూపించాడు. ఇప్పుడు ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఫుష్ప 2 లో అస్సలు తగ్గేదేలేదు అంటున్నాడు అల్లు అర్జున్. తాజాగా ఊర్వశివో రాక్షసివో సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న బన్నీ ఈ సినిమాకి సంబంధించి ఆర్ట్ వర్క్ .. కెమెరా .. ఎడిటింగ్ .. మ్యూజిక్ అన్నీ కూడా కరెక్టుగా కుదిరాయి. సునీల్ .. వెన్నెల కిశోర్ .. అనూ ముగ్గురూ కూడా చాలా బాగా చేశారు. శిరీష్ గురించి మాట్లాడే టైమ్ కోసం నేను వెయిట్ చేస్తూ వస్తున్నాను. అలాంటి ఒక సందర్భం, ఇప్పుడు వచ్చింది. నా సినిమా…

పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ రిలీజ్ డేట్
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష, జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటించారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

2 మిలియన్ డాలర్స్ క్లబ్ లో కాంతార
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా 290 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కళ్యాణ్ రామ్ కొత్త మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
కళ్యాణ్ రామ్ మొత్తానికి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక తన చేతిలో చాలా పలు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఇక కళ్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. చాలా సైలెంట్ గా సినిమాను పూర్తిచేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజైన ప్రీ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

త్వరలోనే పూజా కార్యక్రమంతో ప్రారంభం కానున్న #NTR30
బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా .తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.ఈ మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా పలువురు హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటించే అవకాశం ఉంది. ఈ మూవీ కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.