బ్లాక్ బస్టర్ సీక్వెల్ పై బాలకృష్ణ క్లారిటీ

balakrishna about his blockbuster movie aditya 369, balakrishna about aditya 369 Movie, blockbuster movie aditya 369, Nandamuri Balakrishna, Mohini, Singeetam Srinivasa Rao, Ilaiyaraaja, Aditya 369, Aditya 369 Movie, Aditya 369 Update, Aditya 369 New Update, Aditya 369 Latest Update, Aditya 369 Movie Updates, Aditya 369 Telugu Movie, Aditya 369 Telugu Movie Latest News, Aditya 369 Telugu Movie Live Updates, Aditya 369 Telugu Movie New Update, Aditya 369 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ప్రయోగాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చేసిన ప్రయోగమే ఆదిత్య 369. టైమ్‌ మెషీన్ బ్యాక్ డ్రాప్ తో సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో వచ్చిన తొలి తెలుగు సినిమాగా బాలకృష్ణ సినీ కెరీర్‌లోనే కాదు, తెలుగు సినీ చరిత్రలోనూ మైలు రాయిగా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.టైమ్ మిషన్, శ్రీ కృష్ణ దేవరాయలు కాలం సెట్టింగ్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. కృష్ణకుమార్‌గా, శ్రీ కృష్ణ దేవరాయలుగా ద్విపాత్రాభినయం చేసి తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈసినిమాను ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ను తెరకెక్కించాలని కూడా చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలాసార్లు ఈ సినిమాకు సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని పలుమార్లు తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఓ షోలో పాల్గొన్న బాలకృష్ణ మరోసారి ఈసినిమాపై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈసీక్వెల్ కు సంబంధించిన వర్క్ జరుగుతుందని.. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క మొదలుపెట్టానని తెలిపారు. అంతేకాదు ఈసినిమాకు ఆదిత్య 999 అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నట్టు తెలిపాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈసినిమా ద్వారా తన తనయుడు మోక్షజ్ఞ ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. మరి చూద్దాం అది ఎంతవరకూ నిజమవుతుందో.. మరి అప్పటిలాంటి సినిమాలు ఇప్పుడు రావడం అంటే కొంచం కష్టమైన విషయమే. వచ్చినా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియని పరిస్థితి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

కాగా ఈసినిమాలో నందమూరి బాలకృష్ణకు జోడీగా మోహిని జంటగా నటించింది. హీరో తరుణ్ , హీరోయిన్ రాశి బాలనటులుగా ఈసినిమాలో నటించారు. ఇళయరాజా ఈసినిమాకు సంగీత దర్శకుడిగా పని చేశారు. తమిళ భాషలో “అపూర్వ శక్తి 369 ” మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా విజయం సాధించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + eighteen =