అ!, కల్కి, జాంబిరెడ్డి వంటి వినూత్న సినిమాలను తెరకెక్కించి టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీగా ‘హనుమాన్’ ను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జాంబిరెడ్డి సినిమా మంచి హిట్ అవ్వగా ఇప్పుడు ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా ఇన్ని రోజులు షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈసినిమా టీజర్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టీజర్ ను నవంబర్ 15వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Brace Yourself for the Arrival of the Most Powerful SUPERHERO in the Universe-Our #HanuMan 💥🤩#HanuManTeaser unveiling on Nov 15th🗓️
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123@Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets @AsrinReddy pic.twitter.com/i0shCW5zfA— Niranjan Reddy (@Niran_Reddy) November 7, 2022
కాగా `హనుమాన్` ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: