కళ్యాణ్ రామ్ కొత్త మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

#NKR 19 movie title and first look released, #NKR 19 first look released, #NKR 19 movie title released, #NKR 19 movie NKR19 movie, Kalyanram's Amigos, Kalyanram Nandamuri, Ashika Ranganath, Ghibran, Rajender Reddy, Kalyanram Latest Movie, Kalyanram's Upcoming Movie, Amigos, Amigos Movie, Amigos Update, Amigos New Update, Amigos Latest Update, Amigos Movie Updates, Amigos Telugu Movie, Amigos Telugu Movie Latest News, Amigos Telugu Movie Live Updates, Amigos Telugu Movie New Update, Amigos Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

కళ్యాణ్ రామ్ మొత్తానికి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక తన చేతిలో చాలా పలు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఇక కళ్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. చాలా సైలెంట్ గా సినిమాను పూర్తిచేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజైన ప్రీ లుక్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఇప్పటివరకూ 19 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటూ వస్తుంది. తాజాగా ఇప్పుడు ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘అమిగోస్‌’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు పోస్టర్‌ చూస్తే తెలుస్తుంది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోనే సినిమాపై చిత్రబృందం ప్రేక్షకులలో క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తుంది. అంతేకాదు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 10, 2023 న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు.

కాగా ఈసినిమాలో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న ఆషిక రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇంకా ఈసినిమాలో బ్రహ్మాజి, సప్తగిరి, ర‌వి ప్రకాష్, శివ‌న్నారాయ‌ణ‌, చైత‌న్య కృష్ణ, ర‌ఘు కారుమంచి, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, రాజ‌శ్రీ నాయ‌ర్‌, సోనాక్షి వ‌ర్మ త‌దిత‌రులు నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 9 =