100 కోట్ల క్లబ్ లో సర్దార్

karthi sardar movie joins 100 crore club, sardar movie joins 100 crore club, 100 crore club, Sardar Latest Collections, Sardar Collections, karthi's sardar movie, Karthi latest movie, Karthi’s Upcoming Movie, Karthi, Laila, Rashi Khanna, Rajisha Vijayan, P.S. Mithran, Sardar Movie, Sardar Update, Sardar New Update, Sardar Latest Update, Sardar Movie Updates, Sardar Telugu Movie, Sardar Telugu Movie Latest News, Sardar Telugu Movie Live Updates, Sardar Telugu Movie New Update, Sardar Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ప్రస్తుతం సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కోట్లలో కలెక్షన్స్ రాబట్టుకుంటున్నాయి. కథ బావుంటే, కాస్త ప్రయోగాత్మకంగా ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ఒకప్పటిలా కాకుండా ప్రస్తుత హీరోలు కూడా అలాంటి ప్రయోగాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక అలాంటి హీరోల్లో కార్తీ కూడా ముందుంటాడు. అందుకే ఈమధ్య అన్నీ వరుసగా హిట్లను సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గానే సర్దార్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మిత్రన్ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిలర్ గా వచ్చిన ఈసినిమా మంచి హిట్ ను అందుకుంది. కార్తీ రెండు పాత్రల్లో తన నటనతో ఆకట్టుకోవడం దానికి మించి కథ కథనాలు ఉండటంతో అందరినీ ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా రిలీజ్ అయి రెండు వారాలు పూర్తిచేసుకుంది. మూడో వారంలోకి వచ్చేసింది. అయితే ఈసినిమా రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూనే ఉంది. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఈసినిమాకు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈసినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. నేటితో ఈసినిమ వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకున్నట్టు చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అధికారికంగా తెలియచేశారు.

కాగా ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో లక్ష్మణ్‌ కుమార్‌ ఈ సినిమాను నిర్మించారు. రాశీఖన్నా హీరోయిన్ గా నటించిన ఈసినిమాలో రజీషా విజయన్‌, లైలా, యోగి సేతు, మునీష్కాంత్‌, మాస్టర్‌ రిత్విక్‌, మురళీశర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాకు జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫి అందించారు.

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. “ఒక్కసారి గూఢచారి అయితే.. ఎప్పుడూ గూఢచారియే” అంటూ సర్దార్‌ సీక్వెల్ ను ప్రకటించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.