బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా .తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.ఈ మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా పలువురు హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటించే అవకాశం ఉంది. ఈ మూవీ కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు కొరటాల శివ కథను ఫైనల్ చేయడం, తను ఆశించినట్టుగా స్క్రిప్ట్ వచ్చిందని ఎన్టీఆర్ సంతృప్తిని వ్యక్తం చేయడంతో #NTR30 మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధం అయ్యింది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీ త్వరలోనే పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో, ప్రారంభ షెడ్యూల్ కు సంబంధించిన చర్చల్లో దర్శకుడు కొరటాల శివ, కెమెరామన్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని యువసుధ ఆర్ట్స్ తన సోషల్ మీడియా అకౌంట్లో వెల్లడించింది. బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ మూవీ తరువాత కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న#NTR30 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: