
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 36


అల్లు శిరీష్ కి నిఖిల్ కంగ్రాట్స్

సౌత్ ఆఫ్రికా కు అల్లు అర్జున్ ఫ్యామిలీ

బ్రహ్మాస్త్ర క్లైమాక్స్ మేకింగ్ వీడియో రిలీజ్

ఎన్టీఆర్ బాద్ షా మూవీ రీ రిలీజ్ డేట్

3 ప్రాజెక్ట్స్ షూటింగ్స్ తో బిజీగా ప్రభాస్

RAPO 20 కొత్త యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం

రంగమార్తాండ నా కెరీర్ లో బెస్ట్ ఫిలిం

హారర్ మూవీస్ లో స్టార్ హీరోయిన్స్

తనయుడికి సునీత బర్త్ డే విషెస్

కార్తీ జపాన్ మూవీ లాంచ్

యశోద మూవీ ప్రమోషన్స్ లో బిజీగా సమంత

సందీప్ కిషన్ మైఖేల్ రిలీజ్ ప్లాన్

పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలని

నాలుగు భాషలలో అధర్వ

ఫిబ్రవరి లో ఏజెంట్ మూవీ రిలీజ్ ?
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ తో సక్సెస్ అందుకున్న యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఏ కె ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ లో నటిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హిప్ హప్ తమిళ సంగీతం అందిస్తున్నారు.ఏజెంట్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఏజెంట్ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. 2023 సంక్రాంతి కానుకగా ఏజెంట్ మూవీ రిలీజ్ కానుందని సమాచారం.

75 మిలియన్ ఫాలోవర్స్ తో సాహో బ్యూటీ శ్రద్ధాకపూర్ ఇన్ స్టా గ్రామ్ రికార్డ్
తీన్ పత్తి (2010 ) మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయిన శ్రద్ధా కపూర్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ సాహో మూవీ తో శ్రద్ధాకపూర్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. భేడియా మూవీ లో అతిధి పాత్రలో నటించిన శ్రద్ధాకపూర్ ప్రస్తుతం డైరెక్టర్ లవ్ రంజన్ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

అల్లు శిరీష్ కి నిఖిల్ కంగ్రాట్స్
ఇండస్ట్రీలో ఈమధ్య ఒక హీరోకు మరో హీరో సపోర్ట్ దొరుకుతుంది. ఒక హీరో సినిమా హిట్ అయితే మరో హీరో హ్యాపీగా స్పందిస్తున్నాడు. చాలా గ్యాప్ తరువాత వచ్చి ఫైనల్ గా హిట్ ను అందుకున్నాడు అల్లు శిరీష్. రాకేష్ శశి దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా మంచి హిట్ ను అందించింది. శిరీష్ నటన, అను గ్లామర్ తో పాటు యాక్టింగి, కామెడీ, హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఇవన్నీ సినిమా సక్సెస్ కు కారణమయ్యాయి. ఇప్పటికే సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు చిత్రబృందం.

కార్తి జపాన్ మూవీ లో కథానాయికగా అను ఇమ్మాన్యుయేల్
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 , శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రాకేష్ శశి దర్శకత్వంలో అల్లు శిరీష్ , అను ఇమ్మాన్యుయేల్ జంటగా తెరకెక్కిన ఊర్వశివో రాక్షసివో మూవీ నవంబర్ 4 వ తేదీ రిలీజ్అయ్యి ఘనవిజయం సాధించింది. దాంతో టాలీవుడ్ మేకర్స్ కొందరు అను డేట్స్ కోసం సంప్రదిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె హీరో కార్తి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సౌత్ ఆఫ్రికా కు అల్లు అర్జున్ ఫ్యామిలీ
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది.ఈ…

హిట్ 2 ఉరికే ఉరిక్ సాంగ్ ప్రోమో రిలీజ్
టాలెంటెడ్ హీరో అడివిశేష్, శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తున్న సినిమా హిట్2. ఈసినిమా హిట్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో అడివి శేష్ కె.డి అనే పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ అవ్వగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అడివి శేష్ ఖాతాలో మరో హిట్ పడేలా కనిపిస్తుందన్న నమ్మకం ఏర్పడింది.

బ్రహ్మాస్త్ర క్లైమాక్స్ మేకింగ్ వీడియో రిలీజ్
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్-అలియా భట్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా బ్రహ్మాస్త్ర. రెండు భాగాల్లో రాబోతున్న ఈసినిమాలో మొదటి భాగం బ్రహ్మాస్త్ర-శివ ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా సెప్టెంబర్ 9 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి బ్లాక్ బస్టర్ ను అందుకుంది. దీంతో ఈసినిమా అప్పటికే కాస్త డల్ గా ఉన్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు కాస్త ఊరటనిచ్చింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఇక ఈసినిమాప్రస్తుతం ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.

ఎన్టీఆర్ బాద్ షా మూవీ రీ రిలీజ్ డేట్
బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా .తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.దర్శకుడు కొరటాల , హీరో ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతాగ్యారేజ్ మూవీ ఘనవిజయం సాధించింది.

3 ప్రాజెక్ట్స్ షూటింగ్స్ తో బిజీగా ప్రభాస్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ తానాజీ మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీబడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. అక్టోబర్ 2వ తేదీ అయోధ్యలో ఆదిపురుష్ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా టీజర్ ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టుకుని 24 గంటలలో 100 మిలియన్ వ్యూస్ కు పైగా రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.

RAPO 20 కొత్త యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం
ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా RAPO 20. ఇక మాస్ ఎంటర్ టైన్ మెంట్ లు రూపొందించడంలో బోయపాటి శ్రీను ఎంత పర్ఫెక్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈసినిమాపై మొదటినుండి భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాను పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు.. రామ్ చేయనున్న రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది.

రంగమార్తాండ నా కెరీర్ లో బెస్ట్ ఫిలిం
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమాలో ప్రతి ఒక్కరి డబ్బింగ్ కు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇక ఈసినిమాలో ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా ఈసినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు. ఈసినిమాకు ముందు నేను దర్శకత్వం వహించాలని అనుకున్నాను, అయితే కృష్ణ వంశీ దర్శకత్వం వహించడానికి సరైన వ్యక్తి అని అనుకున్నా…

హారర్ మూవీస్ లో స్టార్ హీరోయిన్స్
హీరో , డైరెక్టర్ రాఘవ లారెన్స్ పలు హారర్ కామెడీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో పలు హారర్ , కామెడీ హారర్ మూవీస్ సందడి చేశాయి. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు హారర్ మూవీస్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార మాయ , ఐరా , డోరా వంటి హారర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తాజాగా నయనతార మరో హారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో హారర్ మూవీ కనెక్ట్ తెరకెక్కుతుంది.

తనయుడికి సునీత బర్త్ డే విషెస్
సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అద్భుత గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. గాయనిగా తన స్వరంతో ఎన్నో సూపర్ హిట్ పాటలతో తెలుగు శ్రోతలను అలరించింది. కేవలం గాయనిగా మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సునీత.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా పై రిషబ్ శెట్టి క్లారిటీ
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మూవీ తో రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా నటుడు , దర్శకుడు గా గుర్తింపు పొందారు.

న్యూజి లాండ్ లో RC15 మూవీ స్పెషల్ సాంగ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో #RC15 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్, విలన్ గా నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .#RC15 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #RC15 మూవీ హైదరాబాద్, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి.

కార్తీ జపాన్ మూవీ లాంచ్
తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు వరుస విజయాలను సైతం అందుకుంటున్నాడు. విరుమన్, పొన్నియన్ సెల్వన్, రీసెంట్ గా సర్దార్ ఇలా వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అంతేకాదు తాజాగా ఈసినిమా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇక ఇప్పటికే కార్తీ అటు సర్దార్ సీక్వెల్ ను ప్రకటించాడు. మరోవైపు ఖైదీ సినిమా సీక్వెల్ ను కూడా చేయనున్నాడు. ఈరెండు సినిమాలు ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.

యశోద మూవీ ప్రమోషన్స్ లో బిజీగా సమంత
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ నవంబర్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.యశోద మూవీ తెలుగు , తమిళ భాషలతో పాటు కన్నడ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

సందీప్ కిషన్ మైఖేల్ రిలీజ్ ప్లాన్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటే మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో సందీప్ కిషన్ కొత్త మేకోవర్ తో అలరించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే రిలీజైన సందీప్ పోస్టర్లకు అలాగే టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా రిలీజ్ డేట్ ను…

పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలని
స్టార్ హీరోయిన్ గా ఇన్నేళ్లు కెరీర్ లో రాణించిన సమంత ఇప్పుడు ప్రయోగాత్మక సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది. కేవలం ఒక్క భాషలోనే కాదు పలు భాషల్లో తన స్తతా చాటుకుంటుంది. ఇక తెలుగులో ప్రస్తుతం యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. ఈసినిమా రిలీజ్ దగ్గర పడుతున్నకొద్దీ చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయింది. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత పాల్గొనలేకపోవడం చూస్తునే ఉన్నాం. దానికి కారణం కూడా మనకు తెలుగు. ప్రస్తుతం తను మయోసైటిస్ వ్యాధితో బాధ పడుతుండటంతో ప్రస్తుతం అయితే అందుకు చికిత్స తీసుకుంటుంది.

నాలుగు భాషలలో అధర్వ
నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తిక్ రాజు హీరోగా తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ అధర్వ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ కానుంది. , సిమ్రాన్ చౌదరి, ఐరా కథానాయికలు. ఈ మూవీ లో అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.