ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్. ప్రస్తుతం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే హిట్2 సినిమా. ఈసినిమా హిట్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా హిట్. ఇప్పుడు విశ్వక్ సేన్ స్థానంలో అడివి శేష్ నటిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతోనే ఉన్నారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా నుండి మొదటి సింగిల్ ఉరికే ఉరికే అంటూ వచ్చే రొమాంటిక్ సాంగ్ ను నవంబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

కాగా ఈసినిమాలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటించనుంది. నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈసినిమాను నిర్మిస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్ స్టీవర్ట్ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. ఈసినిమా డిసెంబర్ 2, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























