చరణ్ బ్యాక్.. #RC15 కొత్త షెడ్యూల్ అప్ డేట్

rc15 new schedule commence during this time, RC15 new schedule, S. J. Suryah, Ram Charan, Kiara Advani, S. Shankar, Ram Charan 15, Ram Charan latest movie, Ram Charan’s Upcoming Movie, RC15, RC15 Movie, RC15 Update, RC15 New Update, RC15 Latest Update, RC15 Movie Updates, RC15 Telugu Movie, RC15 Telugu Movie Latest News, RC15 Telugu Movie Live Updates, RC15 Telugu Movie New Update, RC15 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. లెజెండరీ డైరెక్టర్, స్టార్ హీరో రామ్ చరణ్కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా శంకర్ కూడా ఆదే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. అయితే మధ్య మధ్యలో ఈసినిమా షూటింగ్ కు బ్రేకులు పడుతున్నాయి. దీనికి తోడు శంకర్ అటు చరణ్ ఇటు ఇండియన్ 2 సినిమాలను కూడా పార్లల్ గా చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అయితే శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇన్ని రోజులు రామ్ చరణ్ సతీమణి ఉపాసనతో ట్రిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని రోజులు జపాన్ లో పర్యటించిన చరణ్.. అక్కడ పర్యటన ముగించుకుని డైరెక్ట్ గా టాంజానియాకి వెళ్లారు. రామ్ చరణ్ దంపతులు టాంజానియా లో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇక తాజాగా ఇంటికి తిరిగి వచ్చేశారు ఇద్దరూ. ఈకారణంగానే చరణ్ ట్రిప్ లో ఉండటంతో శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాడు. ఇప్పుడు చరణ్ తిరిగి రావడంతో మళ్లీ ఆర్సీ15 షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈనెల ఎండింగ్ నుండి ఈసినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది.

కాగా కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =