
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా 290 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ మూవీ పై ప్రేక్షకులతోపాటు ,సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
విశేష ప్రేక్షకాదరణ తో కన్నడ, తెలుగు సహా హిందీ భాషల్లో భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న కాంతార మూవీ ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.లేటెస్ట్ గా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 324 కోట్ల కు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రం యూఎస్ లో లేటెస్ట్ గా 2 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.







