స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో, అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “అరుంధతి ” మూవీ 13 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా అనుష్క సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆ మూవీ లో జేజమ్మ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అనుష్కను లేడీ సూపర్ స్టార్‌ని చేసిన ఈ చిత్రం ఆమెకే కాదు, తెలుగు చలన చిత్ర పరిశ్రమకే గర్వకారణంగా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
అరుంధతి చిత్రానికి 13 సంవత్సరాలనీ , ఏ నటికైనా జీవితంలో ఒకే ఒక్కసారి మాత్రమే నటించగల పాత్ర అంటూ ఒకటి ఉంటుందనీ , .జేజమ్మ పాత్ర తన జీవితంలో అటువంటిదనీ , ఎన్ని పాత్రలు చేసినా.. జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకునే పాత్రలు కొన్నే ఉంటాయనీ , ఈ అవకాశం తనకు ఇచ్చిన కోడి రామకృష్ణగారికి, శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారికి, “అరుంధతి” టీమ్ మొత్తానికి ధన్యవాదాలనీ , ఈ చిత్రానికి ప్రేక్షకులు అందించిన సపోర్ట్ మరిచిపోలేనిదనీ , ఈ సందర్భంగా ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలనీ , ఈ చిత్రం తనకెంతో ప్రత్యేకమైనదనీ అనుష్క ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: