అభిషేక్ పిక్చర్స్ , ఆర్ టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” మూవీ సంక్రాంతి సందర్బంగా జనవరి 14న లాంచనంగా ప్రారంభం అయ్యింది. రవితేజ పది డిఫరెంట్ గెటప్ లలో కనిపించి సర్ ప్రైజ్ చేయబోతున్న ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ కథానాయికలు. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్ , భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
భోగి పండగ రోజు లాంఛనంగా మెగాస్టార్ చిరంజీవి క్లాప్ తో ప్రారంభమైన “రావణాసుర” మూవీ సెప్టెంబర్ 30 న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలోని ఓ లుక్ ని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. చాలా రఫ్ లుక్ లో మాసీవ్ గా కనిపిస్తూ లైటర్ తో సిగార్ కాలుస్తూ ఉన్న రవితేజ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. “రావణాసుర” మూవీ రెగ్యులర్ షూటింగ్ సోమవారం ప్రారంభం అయినట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ లో దర్శకుడు సుధీర్ వర్మ కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: