అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో‘ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. బన్నీ కెరియర్ లోనే ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకొని కెరీర్ బెస్ట్ సినిమాగా నిలిచింది. త్రివిక్రమ్ స్టైల్ డైలాగ్స్, బన్నీ కామెడీ టైమింగ్, పూజ గ్లామర్ అన్నీ ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి. ఇక థమన్ సంగీతం అందించగా పాటలు ఎన్ని రికార్డులు క్రియేట్ చేశాయో కూడా చూశాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్లీ ఈసినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. మళ్లీ రిలీజ్ చేస్తే ఎవరు చూస్తారనుకుంటున్నారా..? అయితే రిలీజ్ చేసేది హిందీలో. రీసెంట్ గా వచ్చిన బన్నీ సినిమా
పుష్ప నార్త్ లో ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం పరిస్థితులు అంత బాగాలేకపోయినా కూడా అక్కడ భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది. అల్లుఅర్జున్ మేకోవర్, తన భాషా, యాస అన్నీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. దీంతో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. ఈనేపథ్యంలో బన్నీకి పెరిగిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని మళ్లీ హిందీలో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు. అందుకు రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని జనవరి 26న థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు.
ఇక ఈసినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. షెహజాదా అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. బన్నీ, పూజా హెగ్డే పాత్రల్లో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ కనిపించనున్నారు. ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను ఈఏడాది చివరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: