మొత్తానికి సౌత్ సినిమాల హవా ఇప్పుడు నార్త్ లో బాగానే సాగుతుంది. నాలుగైదేళ్ల క్రితం మనవాళ్లు నార్త్ సినిమాలను రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపేవాళ్లు. కానీ ఇప్పుడు తెలుగు సినిమాల రేంజ్ ఎలా మారిందో చూశాం. విభిన్నమైన కథలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. అంతేకాదు కొత్త కొత్త డైరెక్టర్లు, కొత్త సినిమాలతో ఇలా టాలీవుడ్ మార్కెట్ స్థాయి పూర్తిగా మారిపోయాయి. అంతేనా కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇన్ని సినిమాలు రిలీజ్ చేసిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది టాలీవుడ్ మాత్రమే. మంచి సక్సెస్ రేటును అందుకున్న ఇండస్ట్రీ కూడా టాలీవుడ్ మాత్రమే. ఇప్పటికే బాహుబలి, సాహో సినిమాలు నార్త్ లో బాక్సాఫీస్ ను షేక్ చేయగా.. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఇప్పుడు పుష్ప సినిమా చేరిపోయింది. పుష్ప సినిమాకు నార్త్ లో వస్తున్న రెస్పాన్స్ చూస్తూనే ఉన్నాం. ఈసినిమా బ్లాక్ బస్టర్ కొట్టడమే కాకుండా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాకు వచ్చిన క్రేజ్ తోనే ఇప్పుడు అల వైకుంఠపురములో సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా హిందీలో రీమేక్ అవుతున్నా అది రిలీజ్ అవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. ఇక ఈ అవకాశం కూడా కలిసొచ్చింది మేకర్స్ కు. ఈసినిమా హిందీ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. జనవరి 26న ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు అల వైకుంఠపురములో సినిమా రూట్ లోనే రంగస్థలం కూడా చేరిపోయింది. పుష్ప హిట్ తో ఇప్పుడు సుకుమార్ సినిమాలపై హిందీ మేకర్స్ అక్కడ రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
దీనిలో భాగంగానే గోల్డ్ మైన్స్ సంస్థ అధినేత మనీష్ రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రాన్ని హిందీలో డబ్బింగ్ చేయడానికి రెడీ అయినట్టు సమాచారం. ఫిబ్రవరిలో ‘రంగస్థలం’ హిందీ వెర్షన్ ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ కూడా నార్త్ ఆడియన్స్ కు బాగా సుపరిచితమే. దీంతో ఈసినిమా కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారట. ఇంకా వీటితో పాటు పలు నార్త్ సినిమాల హక్కులను మనీష్ సొంతం చేసుకున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అసలే ప్రస్తుతం హిందీ మార్కెట్ చాలా డల్ గా ఉంది. ఈ టైమ్ లో బన్నీ, చరణ్ సినిమాలు మళ్లీ నార్త్ ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పిస్తాయన్న ఆశతో ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: