
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 201


ఫ్యామిలీ తో పూజాహెగ్డే మాల్దీవ్స్ ట్రిప్

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ రావడం పక్కా..!

సీఎం జగన్ తో సమావేశం పై మహేష్ బాబు స్పందన

'కాతు వాకుల రెండు కాదల్' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

హీరో రవితేజ తో అనసూయ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్

కార్తికేయ స్పెషల్ థ్యాంక్స్

"హరి హర వీరమల్లు "మూవీ కి భారీ సెట్స్

ఆ బయోపిక్ ఖచ్చితంగా ఉంటుంది..!

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు చిరంజీవి కృతజ్ఞతలు

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' టీజర్ రిలీజ్

'వాలిమై' తెలుగు ట్రైలర్ రిలీజ్

'సన్ ఆఫ్ ఇండియా' ట్రైలర్ రిలీజ్

అనసూయ లేటెస్ట్ పింక్ శారీ లుక్

శివ కార్తికేయన్ తెలుగు , తమిళ మూవీ ప్రారంభం

"డిజే టిల్లు" మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

జగన్ తో ముగిసిన భేటీ.. త్వరలో గుడ్ న్యూస్..!

నెలలో రిలీజ్.. ఇప్పుడు పోస్టర్లు ఏంటి డార్లింగ్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు దేశం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'రాధేశ్యామ్'. ఇక ఎన్నో రిలీజ్ డేట్లు వాయిదా పడిన అనంతరం ఆఖరిగా మార్చి 11న తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన టీజర్, పాటలు పలు రికార్డులను నమోదు చేశాయి. దీనితోపాటు రీసెంట్ గానే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా అది కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం మళ్లీ ప్రమోషన్స్ ను జోరుగా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక దీనిలో భాగంగానే ఈసినిమా ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతంది కాబట్టి ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే…

ఫ్యామిలీ తో పూజాహెగ్డే మాల్దీవ్స్ ట్రిప్
టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్”, “బీస్ట్ ”( తమిళ} మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. “#SSMB28”, “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.“యానిమల్”హిందీ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కై దర్శకుడు సందీప్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ను…

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ రావడం పక్కా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా తరువాత ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే కొరటాల శివతో తన తరువాత సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వాలి కానీ ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల.. కరోనా వల్ల.. మధ్యలో తన చేతికి కూడా గాయం అవ్వడం ఇలా పలు కారణాల వల్ల ఇంతవరకూ ఆలస్యమైంది. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

'సర్కారు వారి పాట' కళావతి సాంగ్ ప్రోమో రిలీజ్..!
పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇక ఈసినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమాకు ముందు నుండీ మంచి బజ్ ఉంది. కొంత కాలంగా కాస్త సెటిల్డ్ పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు. అయితే ఈసినిమాలో మాత్రం మహేష్ పూర్తిగా తన మేకోవర్ ను మార్చేసి మంచి స్టైలిష్ లుక్ తో పోకిరి మహేష్ బాబును చూస్తున్న ఫీలింగ్ ను తెచ్చాడు. అంతేకాదు.. బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన వీడియోలో మహేష్ ఎనర్జిటిక్ యాక్షన్.. పంచ్ లు అందరికీ నచ్చేశాయి. ఆ చిన్న వీడియోనే పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం మిగిలిన షూట్ ను ముగించుకునే పనిలో…

సీఎం జగన్ తో సమావేశం పై మహేష్ బాబు స్పందన
చిత్ర పరిశ్రమ సమస్యల పై హీరోలు చిరంజీవి , ప్రభాస్, మహేష్ బాబు, దర్శ కులు రాజమౌళి, కొరటాల శివ, నటులు పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి, సీఎం జగన్ తో సమావేశం అయిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. గత 6 నెలలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కన్ఫ్యూజన్ లో ఉంది. నిజానికి ఈరోజు ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవాలి, స్పెషల్ గా పేర్ని నాని కి, సిన్సియర్ థ్యాంక్స్ టు సీఎం జగన్ కి అని అన్నారు. మీరందరూ ఒక వారం పది రోజుల్లోనే గుడ్ న్యూస్ వింటారని చెప్పారు.

'డీజే టిల్లు' యూత్ ఫుల్ మూవీ.. అడల్ట్ సినిమా కాదు..!
విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా డీజే టిల్లు. ఈసినిమా రిలీజ్ కు ఇంకా ఒక్కరోజు మాత్రమే టైమ్ ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అయితే సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇక ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

'కాతు వాకుల రెండు కాదల్' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, టాలీవుడ్ స్టార్ హీరోయన్ సమంత, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయతార లీడ్ రోల్స్ లో వస్తున్న సినిమా చిత్రం కాతువాకుల రెండు కాదల్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు చిత్రయూనిట్. వరుసగా అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. నిన్ననే ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న క్రికెటర్ శ్రీశాంత్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్రబృందం.. నేడు ఈసినిమా టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్ చేస్తూ అప్ డేట్ ఇచ్చారు. ఈ…

హీరో రవితేజ తో అనసూయ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్
పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి ” మూవీ ఈ రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కార్తికేయ స్పెషల్ థ్యాంక్స్
జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” తమిళ మూవీ తెలుగు , కన్నడ , హిందీ భాషలలోఫిబ్రవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయిక. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో కార్తికేయ ఒక నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “వాలిమై” మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , ఫస్ట్ సింగిల్ , కార్తికేయ లుక్ , ఫస్ట్ గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

"హరి హర వీరమల్లు "మూవీ కి భారీ సెట్స్
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” మూవీ 2022 ఏప్రిల్ 29 వ తేదీ తెలుగు , తమిళ ,మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ , ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఆ బయోపిక్ ఖచ్చితంగా ఉంటుంది..!
ఇప్పటి వరకూ తెలుగు, తమిళ్, హిందీలో ఎంతోమంది క్రీడాకారుల బయోపిక్ లు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ఆర్ బయోపిక్, చంద్రబాబు బయోపిక్, ఘంటసాల బయోపిక్, జయలలిత బయోపిక్, విశ్వనాథ్ బయోపిక్ అంటూ సినిమా రంగానికి చెెందిన పలువురు బయోపిక్ లు వచ్చాయి. అంతేకాదు ఇంకా రాజకీయ నాయకులతో పాటు ఎం.ఎస్ ధోని, కపిల్ దేవ్, సైనా నెహ్వాల్ ఇలా పలువురి క్రీడాకారుల బయోపిక్ లు కూడా వచ్చాయి. ఇక ఈ జాబితాలో ప్రముఖ బ్యాడ్మింటన్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ కూడా ఉంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ప్రముఖ బ్యాడ్మింటన్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ తెరకెక్కుతున్నట్టు ప్రకటించి కూడా చాలా కాలం అవుతుంది…

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు చిరంజీవి కృతజ్ఞతలు
చిత్ర పరిశ్రమ సమస్యల పై చిరంజీవి , ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి సీఎం జగన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. చిన్న సినిమాలకు ఐదవ షోకు అంగీకారం, తెలంగాణాలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందినట్టుగానే ఆంధ్రాలోనూ అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలూ కల్పిస్తామనీ సీఎం జగన్ అన్నట్టుగా చిరంజీవి చెప్పారు. ఉభయ రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందనిచెప్పామనీ , జగన్ గారితో చర్చ ఫలప్రదం అయ్యిందనీ , దానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రికి, పేర్ని నానికి, అలాగే న్యాయబద్ధంగా ఫైనల్ డ్రాఫ్ట్ ఇచ్చినందుకు కమిటీ సభ్యులకు ధన్యవాదాలనీ , ఈ నెల మూడవ వారం లోపల…

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' టీజర్ రిలీజ్
కిషోర్ తిరుమల దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈసినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఇప్పటికే విడుదల అయిన పోస్టర్ల తో పాటు ఒక పాట కూడా రిలీజ్ అవ్వగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పెళ్లి అయినా, పండగ అయినా, మన 'చిరు' జీవితం అయినా... సందడి అంతా ఆడవాళ్లదే అంటూ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ లో పెళ్లి కోసం శర్వానంద్ ఎన్ని తిప్పలు పడతాడో చూపించారు చిత్ర దర్శకుడు…

'వాలిమై' తెలుగు ట్రైలర్ రిలీజ్
హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై”. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే నెర్కొండ పార్వాయి రాగా.. ఇప్పుడు వస్తుంది రెండో సినిమా. ఇక ఈ సినిమాలో అజిత్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. ఇక ఈసినిమాని కూడా జనవరి 13 వ తేదీన విడుదల చేసేందుకు ముందు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే కరోనాతో పాటు తమిళనాడులో థియేటర్స్‌లో సగం ఆక్యుపెన్షీ కారణంగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది టీమ్. ఫైనల్ గా ఫిబ్రవరి 24వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు మళ్లీ స్టార్ట్ చేశారు చిత్రయనిట్.

'సన్ ఆఫ్ ఇండియా' ట్రైలర్ రిలీజ్
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా సినిమాలు చేసి చాలా కాలమైంది. అయితే పలు సినిమాల్లో కొన్ని కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత మోహన్ బాబు ప్రధాన పాత్రలో రత్నబాబు దర్శకత్వంలో సన్ ఆఫ్ ఇండియాఅనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 18న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇక దీనిలో భాగంగానే తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఎన్టీఆర్ , అల్లు అర్జున్ లతో నటించాలని ఉంది - దీపిక పడుకొనే
సూపర్ హిట్ “ఓం శాంతి ఓం “మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన దీపికా పడుకొనే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ మూవీ తో దీపిక టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

అనసూయ లేటెస్ట్ పింక్ శారీ లుక్
సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “ఆచార్య ““రంగమార్తాండ “,“ఫ్లాష్ బ్యాక్ ”, “పక్కా కమర్షియల్ ” “గాడ్ ఫాదర్ ” మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ కీలక పాత్రలో తెరకెక్కిన “ఖిలాడి” మూవీ ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

శివ కార్తికేయన్ తెలుగు , తమిళ మూవీ ప్రారంభం
కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్ , విజయ్ , విక్రమ్ , సూర్య ,ధనుష్, కార్తీ , శివ కార్తికేయన్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్పటికే ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల , ధనుష్ హీరోగా ఒక మూవీ ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా ఒక తెలుగు మూవీ ని అనౌన్స్ చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో “సార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా "వరుణ్ డాక్టర్" మూవీ తో ప్రేక్షకులను అలరించిన శివ కార్తికేయన్ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న ఒక మూవీకి…

"డిజే టిల్లు" మూవీ మేకింగ్ వీడియో రిలీజ్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ , “మెహబూబా “, “గల్లీ రౌడీ “మూవీస్ ఫేమ్ నేహా శెట్టి జంటగా తెరకెక్కిన “డీజే టిల్లు” మూవీ ఫిబ్రవరి 12వ తేదీ రిలీజ్ కానుంది. ప్రిన్స్ , బ్రహ్మాజీ , ప్రగతి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి థమన్ ఎస్ , శ్రీ చరణ్ పాకాల , రామ్ మిర్యాల సంగీతం అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ఈ మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.

జగన్ తో ముగిసిన భేటీ.. త్వరలో గుడ్ న్యూస్..!
సినిమా టికెట్ల రేటు పెంపు విషయంపై ఏపీ ప్రభుత్వానికి.. టాలీవుడ్ కు మధ్య గత కొద్దిరోజులుగా వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇక నేడు మరోసారి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. అయితే ఈసారి జగన్ తో పాటు సినీ పరిశ్రమ నుండి ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి పాల్గొన్నారు.