విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా డీజే టిల్లు. ఈసినిమా రిలీజ్ కు ఇంకా ఒక్కరోజు మాత్రమే టైమ్ ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అయితే సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇక ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత నాగవంశీ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ప్రస్తుతం కరోనా వల్ల పరిస్థితులు సరిగ్గా లేవు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్స్ రావడం అంటే చాలా కష్టం.. అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్ రావడం అంటే ఇంకా చాలా కష్టం. యూత్ ఆడియన్స్ మాత్రమే థియేటర్ కు వస్తారు.. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించాలంటే యూత్ ఫుల్ సినిమాలే అవసరం అని తెలిపాడు. డీజే టిల్లు మంచి యూత్ ఫుల్ సినిమా.. అంతేకానీ అడల్ట్ సినిమా కాదు. ముద్దు సన్నివేశాలు కూడా అడల్డ్ కిందకు వస్తాయనుకోవడం కరెక్ట్ కాదు. అడివి శేషు, నవీన్ పోలిశెట్టి లాంటి వాళ్లంతా మల్టీటాలెంటెడ్. సిద్థు కూడా అలాంటివాడే. ట్రైలర్ చూస్తే అతని రైటింగ్ స్టైల్ అర్థమవుతుంది. సినిమా మొత్తం మాట్లాడుతూనే ఉంటాడు. ఈ సినిమాకు సీక్వెల్ చేేసే ఆలోచన కూడా ఉంది. దానికి తగ్గట్టే ఈసినిమా ఎండింగ్ ఉంటుందని తెలిపారు.
కాగా పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యంగ్ హీరో ప్రిన్స్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తుండగా.. బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. సాయిప్రకాష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























