‘సన్ ఆఫ్ ఇండియా’ ట్రైలర్ రిలీజ్

Mohan Babus Son Of India Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Mohan Babu,Hero Mohan Babu,Actor Mohan Babu,Tollywood Actor Mohan Babu,Mohan Babu Tollywood Hero in Son Of India Movie,Mohan Babu Upcoming Movie,Mohan Babu Movies,Mohan Babu Latest Movie, Mohan Babu New Movie,Mohan Babu Son Of india Movie,Mohan Babu Son Of India Movie Trailer,Son Of india Movie Trailer Out Now,Son of India Movie Trailer Out Now,Mohan Babu Upcoming Movie Son Of India, Son oF india on Feb 18th,Son OF India Movie On Feb 18th Release,Dimond Ratna Babu,Director Ranta Babu,Ratna babu Movie Son OF India,#Ilaiyaraaja,Pragya Jaiswal with Mohan Babu, Pragya Jaiswal in Son Of India,#iVishnuManchu,#SonofIndiaTrailer

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా సినిమాలు చేసి చాలా కాలమైంది. అయితే పలు సినిమాల్లో కొన్ని కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత మోహన్ బాబు ప్రధాన పాత్రలో రత్నబాబు దర్శకత్వంలో స‌న్ ఆఫ్ ఇండియాఅనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 18న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇక దీనిలో భాగంగానే తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ ను చూస్తే ఈసినిమాలో మోహన్ బాబు ఎన్ఐఏ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ట్రైలర్‌లో మోహన్ బాబు వివిధ గెటప్‌లలో కనిపించారు. ప్రపంచంలో ఏ పోరాటమైనా ఒక్కడితోనే మొదలవుతోంది అంటూ మోహన్ బాబు వాయిస్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతోంది. ప్రపంచం అంతా నా కుటుంబం. ప్రపంచం బాధ నా బాధ. అంటూ.. స్వామి.. ధర్మ సంస్థాపనార్ధయా .. సంభవామి.. యుగే యుగే అంటూ మహా భారతంలో శ్రీ కృష్ణ పరమాత్ముడు చెప్పిన దాన్నే ఫాలో అవుతాను.. మన దేశంలో డబ్బున్నోడికి న్యాయం.. డబ్బు లేనోడికో న్యాయం.. పవర్ ఉన్నోడికో న్యాయం.. లేనోడికో న్యాయం అంటూ మోహన్ బాబు చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమాలో మోహన్ బాబుతో పాటు శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో తనికెళ్ళ భరణి, ఆలీ, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, రాజా రవీంద్ర, రఘుబాబు కనిపించనున్నారు. ఇళయరాజా సంగీత అందిస్తుండగా.. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళయ రాజా సంగీతం అందిస్తున్నారు. అంతేకాదు మోహన్ బాబు ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =