పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు దేశం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘రాధేశ్యామ్‘. ఇక ఎన్నో రిలీజ్ డేట్లు వాయిదా పడిన అనంతరం ఆఖరిగా మార్చి 11న తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన టీజర్, పాటలు పలు రికార్డులను నమోదు చేశాయి. దీనితోపాటు రీసెంట్ గానే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా అది కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం మళ్లీ ప్రమోషన్స్ ను జోరుగా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక దీనిలో భాగంగానే ఈసినిమా ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతంది కాబట్టి ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా మూవీ టీమ్ థీమ్ పార్టీ నిర్వహించబోతోంది.ఇప్పటికే దీనికి సంబంధించిన ఓ భారీ సెట్ కూడా సిద్ధమవుతోంది. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు కూడా హాజరవుతున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ కు ఇంకా సరిగ్గా నెలరోజులు ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ దానిని గుర్తుచేసుకుంటూ పోస్టర్లు కూడా క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రభాస్ ఫ్యాన్ ఒకరు ప్రభాస్ ఫొటోలతో ఒక పోస్టర్ ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దానికి డైరెక్టర్ రాధాకృష్ణ సైతం స్పందించి.. అభినందించాడు. ఇక దానికి అభిమాని సార్ ఈ నెల 14 న మన రాధేశ్యామ్ మూవీ నుండి ఒక పోస్టర్ నీ రిలీజ్ చేయండి అంటూ కామెంట్ పెట్టగా.. ఒక నెలలో రిలీజ్ పెట్టుకొని ఇంకా పోస్టర్స్ ఏంటి డార్లింగ్” అంటూ..అంటూ రాధాకృష్ణ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
One month lo release pettukoni Inka posters Enti darling !!
— Radha Krishna Kumar kk (@director_radhaa) February 11, 2022
కాగా రాధా కృష్ణ దర్శకత్వంలో వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇటలీలో జరిగే ప్రేమకథగా ఈసినిమా వస్తుంది. ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: