కిషోర్ తిరుమల దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈసినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఇప్పటికే విడుదల అయిన పోస్టర్ల తో పాటు ఒక పాట కూడా రిలీజ్ అవ్వగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పెళ్లి అయినా, పండగ అయినా, మన ‘చిరు’ జీవితం అయినా… సందడి అంతా ఆడవాళ్లదే అంటూ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ లో పెళ్లి కోసం శర్వానంద్ ఎన్ని తిప్పలు పడతాడో చూపించారు చిత్ర దర్శకుడు. మొత్తానికి ఈ సినిమా ఫుల్ అండ్ ఫ్యామిలీ స్టొరీగా తెరకెక్కుతుందని ఈ టీజర్ చూస్తే అర్ధమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా శర్వనంద్ ఇప్పటి వరకూ వచ్చిన ఫ్యామిలీ మూవీస్ చాలా హిట్ అయ్యాయి. ఇప్పుడు కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఆడవాళ్లు మీకు జోహర్లు సినిమాతో వస్తున్నాడు. మరి ఎంతో కాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శర్వాకు ఈసినిమాతో అయినా మంచి హిట్ దక్కుతుందేమో చూద్దాం..
పెళ్లి అయినా, పండగ అయినా, మన ‘చిరు’ జీవితం అయినా… సందడి అంతా ఆడవాళ్లదే 😃#AadavalluMeekuJohaarlu Teaser out now!
▶️ https://t.co/HNd1Rc1FPO#AMJOnFEB25@iamRashmika @DirKishoreOffl @ThisIsDSP @sujithsarang @SLVCinemasOffl @LahariMusic @TSeries
— Sharwanand (@ImSharwanand) February 10, 2022
ఇంకా ఈసినిమాలో సీనియర్ రాధిక, ఖుష్బూ, ఊర్వశి కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వెన్నెల కిశోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కల్యాణీ, నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్యకృష్ణ, ఆర్‌సీఎమ్ రాజు తదితరులు నటిస్తున్నారు. జాతీయ అవార్డులు సాధించిన శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సినిమాకు సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: