కార్తికేయ స్పెషల్ థ్యాంక్స్
Hero Kartikeya Special Thanks To Mahesh Babu Sudeep And Ajay Devgan

జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” తమిళ మూవీ తెలుగు , కన్నడ , హిందీ భాషలలోఫిబ్రవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయిక. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో కార్తికేయ ఒక నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “వాలిమై” మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , ఫస్ట్ సింగిల్ , కార్తికేయ లుక్ , ఫస్ట్ గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
“వాలిమై” మూవీ తో కార్తికేయ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. హీరో అజిత్ తో కార్తికేయ పోటీపడి నటించారని సమాచారం.తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను తెలుగు లో సూపర్ స్టార్ మహేష్ బాబు, కన్నడ లో కీచ్చా సుదీప్, హిందీ లో అజయ్ దేవగన్ లు విడుదల చేశారు. “వాలిమై” మూవీ ట్రైలర్ రిలీజ్ చేసినందుకు హీరోలకు కార్తికేయ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.








