యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా తరువాత ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే కొరటాల శివతో తన తరువాత సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వాలి కానీ ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల.. కరోనా వల్ల.. మధ్యలో తన చేతికి కూడా గాయం అవ్వడం ఇలా పలు కారణాల వల్ల ఇంతవరకూ ఆలస్యమైంది. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా రానున్నట్టు అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. కొరటాలతో సినిమా కంటే ముందే ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఈ సినిమానే అన్నారు. అయితే కొరటాల శివ సినిమా మధ్యలో వచ్చింది. మరోవైపు త్రివిక్రమ్ కూడా మహేష్ తో సినిమాను కమిట్ అయ్యాడు. ఈసినిమా పూజా కార్యక్రమాలు కూడా రీసెంట్ గానే జరిగాయి. దీంతో తివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా దాదాపు లేనట్టే అన్న వార్తలు వచ్చాయి.
అయితే ఈసినిమా తప్పకుండా ఉంటుందని.. ఈసినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్ డేట్ ఇచ్చారు ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. తాజాగా ఒక సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న ఈసినిమా గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఆగిపోలేదు.. ప్రస్తుతానికి వాయిదా పడింది అంతే. ఈసినిమాను త్రివిక్రమ్ చాలా భారీగా ప్లాన్ చేశాడు.. ఇండియన్ సినిమా దగ్గర ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా నిలిచే రేంజ్ లో ఉంటుందని చెప్పి క్లారిటీ ఇచ్చారు. మరి ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసి ఆ తర్వాత ఈసినిమాను స్టార్ట్ చేస్తారేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: