
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 194


10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నితిన్ "ఇష్క్"

'నాని' ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లగలడు..!

టాలీవుడ్ లో బిజీగా కీర్తి సురేష్

ఒకే సెట్ లో 'గాడ్ ఫాదర్, భీమ్లానాయక్' ల సందడి..!

"భీమ్లా నాయక్ "ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'సుందరం'

15 వసంతాల తమిళ మూవీ "పరుత్తి వీరన్"

ప్రతిభతోనే పరిశ్రమలో రాణించగలం.- తమన్నా

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ లుక్

మార్చి 1 వ తేదీ నుండి "RRR"మూవీ భారీ ప్రమోషన్స్

రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్ లోడింగ్

దర్శకుడు తేజ కు నితిన్ బర్త్ డే శుభాకాంక్షలు

శతదినోత్సవం దిశగా "అఖండ "

సుకుమార్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి ?

అల్ట్రా స్టైలిష్ లుక్ లో విజయ్ దేవరకొండ
"నువ్విలా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విజయ్ దేవరకొండ సూపర్ హిట్ "పెళ్ళి చూపులు "మూవీ తో హీరోగా మారారు. సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి"మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఈ మూవీ తో విజయ్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బ్లాక్ బస్టర్ "గీతగోవిందం "మూవీ తో విజయ్ స్టార్ డమ్ అందుకున్నారు. "టాక్సీ వాలా ", "డియర్ కామ్రేడ్ "మూవీస్ తో విజయ్ ప్రేక్షకులను అలరించారు. "మీకు మాత్రమే చెప్తా "మూవీ తో విజయ్ నిర్మాతగా మారారు.

10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నితిన్ "ఇష్క్"
శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై విక్రమ్ కుమార్ దర్శకత్వంలో , నితిన్ ,నిత్యామీనన్ జంటగా తెరకెక్కిన "ఇష్క్ " మూవీ 2012 సంవత్సరం ఫిబ్రవరి 24 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకుంది. పి సి శ్రీరామ్ ఫొటోగ్రఫీ , అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. నితిన్ , నిత్యామీనన్ ల పెర్ఫార్మెన్స్ , స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. అందమైన సినిమాటోగ్రఫీ, మంచి డైలాగ్స్ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.

'నాని' ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లగలడు..!
న్యాచురల్ స్టార్ అన్న బిరుదు ఊరికే రాదు కదా. ఏ ఎమోషన్ అయినా న్యాచురల్ గా చూపించే టాలెంట్ ఉంటేనే అలాంటి బిరుదులు ఇస్తుంటారు ప్రేక్షకులు. మరి అలాంటి పేరును తెచ్చుకున్న నటుడు నాని. పక్కింటబ్బాయిలా ఉండే నాని నటనకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఇక ఇప్పుడు నాని నటనపై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఈ డైరెక్టర్ ఎవరో కాదు ఇటీవలే నానితో శ్యామ్ సింగ రాయ్ లాంటి సినిమాను తీసి నానికి మంచి హిట్ అందించిన రాహుల్ సంకృత్యన్.

టాలీవుడ్ లో బిజీగా కీర్తి సురేష్
సూపర్ హిట్ “నేను శైలజ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కీర్తి స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు భాషల మూవీ షూటింగ్స్ లో పాల్గొంటూ కీర్తి సురేష్ సౌత్ ఇండియా లో బిజీయెస్ట్ యాక్ట్రెస్ గా మారారు.

ఒకే సెట్ లో 'గాడ్ ఫాదర్, భీమ్లానాయక్' ల సందడి..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇదిలా ఉండగా చరణ్ సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉన్నా అప్పుడప్పుడు మాత్రం ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు పెడుతూ అభిమానులను ఖుషీ చేస్తుంటాడు. ముఖ్యంగా తన సినిమాలతో పాటు చిరు, పవన్ లకు సంబంధించిన విషయాలను పంచుకోవడానికే చరణ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు.

"భీమ్లా నాయక్ "ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ భారీ ఎత్తున రిలీజ్ కానుంది. “భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందించారు.

'భీమ్లానాయక్'.. 5వ షోకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు రానా అభిమానులు కూడా ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చేసింది. ఇంకా కొద్ది గంటల్లో పవన్ కళ్యాణ్ - రానా కాంబినేషన్ లో తెరకెక్కిన క్రేజీ మల్టీస్టారర్ భీమ్లానాయక్ సినిమా రిలీజ్ కాబోతుంది. మరోవైపు చిత్రయూనిట్ కూడా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా పాటలు, టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ను సొంతం చేసుకున్నాయో చూశాం. అంతేకాదు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది ఈ సినిమా. ఇక ఇప్పుడు చిత్రయూనిట్ కు మరో బంపరాఫర్ ఇచ్చింది టీఎస్ ప్రభుత్వం.

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'సుందరం'
వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా అంటే సందరానికి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇక తాజాగ ఈసినిమా నుండి నానికి సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రేపు నాని పుట్టిన రోజు సందర్భంగా ఈరోజే బర్త్ డే హోమం మొదలైంది అంటూ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నాని పుట్టిన రోజు సందర్భంగా ఇంట్లో పూజలు, హోమాలు చేపించినట్లు చూపించారు. చిన్నప్పటి నుంచి నానికి రకరకాల గండాలున్నాయని, వాటి కోసం పూజలని చేయింస్తున్నట్టు చూపించారు. నాని వాటిని తిట్టుకుంటూనే చేస్తుంటాడు. ఈ వీడియోను బట్టి నాని మళ్లీ కామెడీ ట్రాక్ లో వచ్చినట్టు కనిపిస్తుంది.

15 వసంతాల తమిళ మూవీ "పరుత్తి వీరన్"
స్టూడియో గ్రీన్ బ్యానర్ పై అమీర్ దర్శకత్వంలో తెరకెక్కిన "పరుత్తి వీరన్"(2007 )మూవీ తో స్టార్ హీరో సూర్య సోదరుడు కార్తీ కథానాయకుడిగా కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ప్రియమణి కథానాయిక. బెస్ట్ ఫిల్మ్ , ఈ మూవీ ని అద్భుతంగా తెరకెక్కించిన అమీర్ బెస్ట్ డైరెక్టర్ , అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తీ బెస్ట్ యాక్టర్ , ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరిస్తూ కార్తీ స్టార్ హీరోగా రాణిస్తున్నారు.

ప్రతిభతోనే పరిశ్రమలో రాణించగలం.- తమన్నా
“శ్రీ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్రస్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, వెంకటేష్ “F 3”, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. హిందీలో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. వరుణ్ తేజ్ "గని"మూవీ లో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ లుక్
తెలుగు , తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన ఆయుష్మాన్ ఖురానా “డాక్టర్ జీ”, జాన్ అబ్రహాం “ఎటాక్”, అజయ్ దేవగన్ “రన్ వే 34”, “థ్యాంక్ గాడ్” , “మిషన్ సిండ్రెల్లా “, "చ్ఛాత్రివాలి " ( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “ (తమిళ) మూవీ షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు. తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న "31 అక్టోబర్ లేడీస్ నైట్ " మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.

ఫ్యాన్స్ కే ఆప్షన్స్ ఇచ్చిన 'కె.జి.యఫ్ 2' మేకర్స్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా వస్తున్న సినిమా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’కు ఇది సీక్వెల్. ఇక పార్ట్1 సంచలనాలు క్రియేట్ చేయడంతో ఈ సీక్వెల్ పై అదే స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఫైనల్ గా ఏప్రిల్ 14నే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

"కళావతి "సాంగ్ కు థమన్ డ్యాన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.“సర్కారు వారి పాట” చిత్ర యూనిట్ ప్రేమికుల రోజు సందర్భంగా “కళావతి” లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది.

మార్చి 1 వ తేదీ నుండి "RRR"మూవీ భారీ ప్రమోషన్స్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జంటగా అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా ఒలీవియా మోరిస్ నటించిన , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ ,సాంగ్స్ , ట్రైలర్ , మేకింగ్ వీడియోస్ కు…

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్..!
ఈమధ్య సినిమా టైటిల్స్ తోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక అందులో మొదటి నుండి డిఫరెంట్ టైటిల్స్ ను పెట్డడంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఎప్పుడూ ముందుంటాడు. మొదటి సినిమాకే 'రాజావారు.. రాణివారు' అనే టైటిల్ పెట్టి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ సినిమా తో హిట్ కొట్టాడు. ప్రస్తుతం ‘సమ్మతమే’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. రీసెంట్ గానే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వస్తున్న సినిమాకు వినరో భాగ్యము విష్ణు కథ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్ లోడింగ్
రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు. రీసెంట్ గానే ఖిలాడి సినిమాతో అలరించిన రవితేజ ఈ ఏడాది మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా రిలీజ్ కోసం రెండు డేట్లను ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారు మేకర్స్. మార్చి 25న లేదా ఏప్రిల్ 15న ఈ మూవీని విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు.

దర్శకుడు తేజ కు నితిన్ బర్త్ డే శుభాకాంక్షలు
పలు హిందీ , తెలుగు సూపర్ హిట్ మూవీస్ కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన తేజ సూపర్ హిట్ "చిత్రం "మూవీ తో దర్శకుడిగా మారారు. పలు సూపర్ హిట్ మూవీస్ ను తెరకెక్కించిన దర్శకుడు తేజ పలువురు నటీ నటులను టాలీవుడ్ కు పరిచయం చేశారు. తేజ తన బర్త్ డే సందర్భంగా అభిరామ్ దగ్గుబాటి ని హీరోగా "అహింస " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే.

శతదినోత్సవం దిశగా "అఖండ "
హీరో నందమూరి బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళు సాధించింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు పాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

సుకుమార్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి ?
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానుంది.మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్ “, మెహెర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్ “, బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం లో “చిరంజీవి 154 “మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఒకే సారి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

శ్రీసింహా 'దొంగలున్నారు జాగ్రత్త'.. ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ హీరోల సందడి ఎక్కువైపోయింది. స్టార్ హీరోల కంటే యంగ్ హీరోలే హిట్స్ ఫ్లాప్స్ ను లెక్కచేయకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ఇప్పుడు కీరవాణి తనయుడు శ్రీ సింహా కూడా అదే జోరు కొనసాగిస్తున్నాడు. మొదటి సినిమా 'మత్తు వదలరా' లాంటి భిన్నమైన సినిమాను తీసి విమర్శకుల ప్రసంశలు సైతం దక్కించుకున్నాడు శ్రీ సింహా. ఆ తరువాత తెల్లవారితే గురువారం సినిమాతో ప్రేక్షకుల మందుకు వచ్చాడు. అయితే ఆసినిమా అంత విజయాన్ని అందించలేకపోయింది. ఇక ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ప్రణీత్ బ్రమాండపల్లి దర్శకత్వంలో శ్రీ సింహ నటిస్తున్న సినిమా భాగ్ సాలే. ఇక ఇప్పటికే షూటింగ్ ను…