కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

15 వసంతాల తమిళ మూవీ "పరుత్తి వీరన్"

Karthi Pens A Heartfelt Note As His Favourite Film Completes 15 Years,Actor Karthi Pens Heartfelt Note,Actor Karthi Paruthiveeran Completes 15 Years,Karthi Paruthiveeran Completes 15 Years,Karthi Paruthiveeran Movie Completes 15 Years,15 Years For Pa

15 వసంతాల తమిళ మూవీ "పరుత్తి వీరన్"

Karthi Pens A Heartfelt Note As His Favourite Film Completes 15 Years

Karthi Pens A Heartfelt Note As His Favourite Film Completes 15 Years,Actor Karthi Pens Heartfelt Note,Actor Karthi Paruthiveeran Completes 15 Years,Karthi Paruthiveeran Completes 15 Years,Karthi Paruthiveeran Movie Completes 15 Years,15 Years For Pa

స్టూడియో గ్రీన్ బ్యానర్ పై అమీర్ దర్శకత్వంలో తెరకెక్కిన "పరుత్తి వీరన్"(2007 )మూవీ తో స్టార్ హీరో సూర్య సోదరుడు కార్తీ కథానాయకుడిగా కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ప్రియమణి కథానాయిక. బెస్ట్ ఫిల్మ్ , ఈ మూవీ ని అద్భుతంగా తెరకెక్కించిన అమీర్ బెస్ట్ డైరెక్టర్ , అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తీ బెస్ట్ యాక్టర్ , ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరిస్తూ కార్తీ స్టార్ హీరోగా రాణిస్తున్నారు.

ఈ రోజు తో "పరుత్తి వీరన్" మూవీ 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఎమోషనల్ గా ఫీల్ అయిన హీరో కార్తీ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. "పరుత్తి వీరన్" మూవీ తో తన నటనా జీవితాన్ని ప్రారంభించినందుకు తాను ఆశీర్వాదంగా భావిస్తున్నాననీ , ఈ సినిమాను అమీర్ సార్ రూపొందించారనీ , ఆ క్రెడిట్ అంతా అతనికే చెందుతుందనీ , నేర్చుకున్న అనేక పాఠాలతో , తాను చేసే పనిని ఆస్వాదించడానికి అతను తనకు నేర్పించిన విధానానికి కట్టుబడి ఉన్నాననీ , తనను ఈ అందమైన మార్గంలోకి తీసుకువచ్చినందుకు అమీర్ సార్, జ్ఞానవేల్, అన్న, ప్రియమైన అభిమానులు మరియు మీడియాకు ధన్యవాదాలు అంటూ కార్తీ ట్వీట్ చేశారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్