వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా అంటే సందరానికి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇక తాజాగ ఈసినిమా నుండి నానికి సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రేపు నాని పుట్టిన రోజు సందర్భంగా ఈరోజే బర్త్ డే హోమం మొదలైంది అంటూ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నాని పుట్టిన రోజు సందర్భంగా ఇంట్లో పూజలు, హోమాలు చేపించినట్లు చూపించారు. చిన్నప్పటి నుంచి నానికి రకరకాల గండాలున్నాయని, వాటి కోసం పూజలని చేయింస్తున్నట్టు చూపించారు. నాని వాటిని తిట్టుకుంటూనే చేస్తుంటాడు. ఈ వీడియోను బట్టి నాని మళ్లీ కామెడీ ట్రాక్ లో వచ్చినట్టు కనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Moham pagilipothundhi😭#AnteSundaraniki on June 10th♥️ https://t.co/udl9uXPkAt pic.twitter.com/xgybR13mPe
— Nani (@NameisNani) February 23, 2022
ఇక ఈ వీడియోతో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు మేకర్స్. అందరూ రెండు రిలీజ్ డేట్లు ఫిక్స్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఏడు రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకొని సమ్మర్ కు వస్తున్నాం అంటూ చమత్కరించారు. ఇక ఇప్పుడు ఫైనల్ గా జూన్ 10వ తేదీన ‘అంటే సుందరానికి’ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
కాగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నజ్రియా హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: