“నువ్విలా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విజయ్ దేవరకొండ సూపర్ హిట్ “పెళ్ళి చూపులు “మూవీ తో హీరోగా మారారు. సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి”మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఈ మూవీ తో విజయ్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బ్లాక్ బస్టర్ “గీతగోవిందం “మూవీ తో విజయ్ స్టార్ డమ్ అందుకున్నారు. “టాక్సీ వాలా “, “డియర్ కామ్రేడ్ “మూవీస్ తో విజయ్ ప్రేక్షకులను అలరించారు. “మీకు మాత్రమే చెప్తా “మూవీ తో విజయ్ నిర్మాతగా మారారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా “లైగర్” మూవీ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. విజయ్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ విజయ్ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న తన ఫొటోస్ ను షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































