డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఆర్ ఆర్ ఆర్” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి , రామ్ చరణ్ , ఎన్టీఆర్ పాల్గొంటూ ఆ మూవీ కి సంబంధించిన కొత్త కొత్త విషయాలను రివీల్ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు రాజమౌళి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. “ఆర్ ఆర్ ఆర్” మూవీలో ఎమోషన్ ప్రధానం అనీ ,యాక్షన్ సన్నివేశాల్లోనూ ఎమోషన్ ఉంటుందనీ , సినిమా మొత్తం రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉంటారనీ , వారి స్నేహం, వారి లక్ష్యం ఈ కథకి బలం అనీ చెప్పారు. హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ ల ఇంట్రడక్షన్ సీన్స్ తో పాటు ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఫైట్, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ వచ్చే యాక్షన్ ఎపిసోడ్.మెయిన్ హైలెట్స్ గా ఉంటాయని సమాచారం. “ఆర్ ఆర్ ఆర్”మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: