రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా రాజమౌళి ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈసినిమా రిలీజ్ కు మరికొద్దిగంటలు మాత్రమే టైముంది. ఇక ఈసినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారు మాత్రమే కాదు ఈసినిమా కోసం సినీ సెలబ్రిటీలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ప్రముఖ రచయిత నిర్మాత అయిన కోన వెంకట్ కూడా తన సోషల్ మీడియా ద్వారా ఈసినిమాకు తన బెస్ట్ విషెస్ ను అందిస్తున్నాడు. ఈ సందర్భంగా తన ఇన్ట్సా ద్వారా రామ్ చరణ్, ఎన్టీఆర్ తో ఉన్న ఒక ఫొటోను పోస్ట్ చేసి.. సరిగ్గా ఇదే రామ్ చరణ్, ఎన్టీఆర్ ల స్నేహానికి బీజం పడింది.. కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ మూమెంట్ లో నేను కూడా ఒక భాగమయ్యాను.. ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్, ఈ మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ వస్తుంది.. ఈ మేరకు జక్కన్న, ఎన్టీఆర్, రామ్ చరణ్ కు నా బెస్ట్ విషెస్ అందిస్తున్నానని తెలిపాడు.
View this post on Instagram
కాగా రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: