రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్‘. 1920లో సాగే ఈ చిత్రం సుమారు రూ. 400 కోట్లతో రూపొందింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకున్నాయి. ఇక ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్ పై చూపించబోతున్నాడు రాజమౌళి. ఇక వీరిద్దరినీ ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ గా ఈసినిమా మార్చి 25న రిలీజ్ కాబోతుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురూ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ లో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎన్టీఆర్, చరణ్ లు ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రాజమౌళి కూడా స్పెషల్ గా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ఇంటర్వ్యూలలో ఇప్పుడు స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ కామెడీ గురించి. ప్రతి ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తన కామెడీతో నవ్వించేస్తున్నాడు. సుమ మీమ్ ఇంటర్వ్యూ, అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ, కీరవాణి ఇంటర్వ్యూలో ఒక్కటేమిటి తను ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ రాజమౌళి గురించి, తను ఎలా షూటింగ్ చేస్తాడు ఇంకా చరణ్ పై ఇలా అన్ని రకాల విషయాలు చెపుతూ చాలా మరోసారి తన కామెడీ యాంగిల్ ను బయటకు తీశాడు. ఇక ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని కామెడీ వీడియోలు మీరు కూడా చూసేయండి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: