రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈసినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. స్వతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించాడు రాజమౌళి. ఇక ఈసినిమా ఈనెల 25న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు టీమ్. ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ టీమ్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ లో పాల్గొంటూ పలు ప్రాంతాలు పర్యటిస్తున్నారు. ఇక ఈసినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో తెలియాలంటే ఇంకా రెండు రోజులు ఆగాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఆర్ఆర్ఆర్ టీమ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంది. హైదరాబాద్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. ఈసందర్బంగా రాజమౌళి మాట్లాడుతూ ప్రకృతి, పర్యావరణం తమ మనసుకు నచ్చిన కార్యక్రమాలని, వీలున్నప్పుడల్లా పచ్చదనం పెంపు కోసం మొక్కలు నాటి, పరిరక్షిస్తున్నామని.. రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంతోష్ సంకల్పం చాలా గొప్పదని, మరింత విజయవంతం కావాలన్నారు.
కాగా తెలుగుతో పాటు హిందీ, మళయాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.