“ముగమూడి “తమిళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన పూజా హెగ్డే కు ఆ మూవీ నిరాశపరిచింది. హీరో నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో పూజా హెగ్డే టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన “ముకుంద “, “సాక్ష్యం “, బాలీవుడ్ ఎంట్రీ మూవీ “మెహంజా దారో “పరాజయం పాలయ్యాయి. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటించిన“ఆచార్య “ఏప్రిల్ 29 , “బీస్ట్ ”( తమిళ ) మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్” మూవీకి మిశ్రమ స్పందన లభించినా ప్రభాస్ , పూజాహెగ్డే ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. “రాధేశ్యామ్ “మూవీ తో పూజాహెగ్డే నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో నెం1 రేసులో దూసుకుపోతున్న పూజాహెగ్డే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. కొన్ని చిత్ర పరాజయాలే తన విజయాలకు తొలి మెట్టుగా మారాయని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: