
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 105


అమెరికా వీధులలో సీనియర్ హీరోయిన్ లయ సందడి

'లైగర్' ట్రైలర్ లాంచ్ అప్ డేట్..!

బాలీవుడ్ ఎంట్రీ పై అల్లు అర్జున్ కామెంట్స్

అఖిల్ "ఏజెంట్ "మూవీ టీజర్ పై మహేష్ బాబు స్పందన

'మాచర్ల నియోజకవర్గం' నితిన్ డబ్బింగ్ స్టార్ట్..!

'రామారావు ఆన్ డ్యూటీ' ట్రైలర్ రిలీజ్

అఫీషియల్.. మెగాస్టార్ తో మాస్ మహారాజా..!

అమీర్ ఖాన్ కు ధన్యవాదాలు - చిరంజీవి

23 ఏళ్ల 'తమ్ముడు'.. రమణ గోగుల స్వీట్ మెమరీస్..!

"ఆర్ ఆర్ ఆర్" ట్విట్టర్‌లో ట్రెండింగ్ గా ఎన్టీఆర్ ఇంటర్వెల్ ఇంట్రడక్షన్ సీన్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. “ఆర్ ఆర్ ఆర్”మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది.

'కార్తికేయ 2'.. టీమ్ కు మధుర నుండి ప్రత్యేక ఆహ్యానం..!
చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా కార్తికేయ2 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కార్తికేయ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి కూడా విదితమే. కార్తికేయ సినిమా సుబ్రహ్మణ్యస్వామి నేపథ్యంలో తెరకెక్కగా ఇప్పుడు కార్తికేయ 2 ద్వారకా, కృష్టుడు బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ ను బట్టి ఆ విషయం అర్థమవ్వగా.. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. ఈసినిమాను కూడా మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందించినట్టు అర్థమవుతుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది అందరికీ. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టీమ్ కృష్ణుని జన్మస్థలమైన మధుర లోని…

బర్త్ డే విషెస్ చెప్పిన అందరికీ థ్యాంక్స్ -కిరణ్ అబ్బవరం
షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టిన కిరణ్ అబ్బవరం.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తొలి సినిమా "రాజావారు రాణిగారు" తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు."ఎస్ఆర్ కల్యాణ మండపం" చిత్రంతో కమర్షియల్ సక్సెస్ సాధించారు. కిరణ్ హీరోగా తెరకెక్కిన "సెబాస్టియన్ PC524", "సమ్మతమే " మూవీస్ పరాజయం పొందాయి. రెండు బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ వచ్చినా కూడా కిరణ్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి.గీతా ఆర్ట్స్ - మైత్రీ మూవీ మేకర్స్ - మెగా సూర్య మూవీస్ వంటి టాలీవుడ్ లోని పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కిరణ్ అబ్బవరంతో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చాయి.

అమెరికా వీధులలో సీనియర్ హీరోయిన్ లయ సందడి
"స్వయంవరం"(1999 ) మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన లయ పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరించారు. తెలుగు ప్రేక్షకులతో పాటు కన్నడ , తమిళ , మలయాళ ప్రేక్షకులను కూడా లయ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అమెరికా లో సెటిల్ అయిన సీనియర్ హీరోయిన్ లయ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పలు సూపర్ హిట్ సాంగ్స్ కు అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేస్తూ ఆ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

'లైగర్' ట్రైలర్ లాంచ్ అప్ డేట్..!
పూరీజగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ సినిమా లైగర్. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మొదటి నుండీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పోస్టర్లు , ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా అవి భారీ బజ్ ని క్రియేట్ చేశాయి. ఇప్పుడు ట్రైలర్ తో తుఫాన్ ని సృష్టించడానికి రెడీ అవుతున్నారు.

బాలీవుడ్ ఎంట్రీ పై అల్లు అర్జున్ కామెంట్స్
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. “పుష్ప: ది రైజ్” మూవీ హిందీ…

రణ్ బీర్ కపూర్ ఫేవరెట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్
"ఆ అబ్ లౌట్ ఛలే" , "బ్లాక్ " బాలీవుడ్ మూవీస్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రణ్ బీర్ కపూర్ "సావరియా" మూవీ తో హీరోగా మారారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ రణ్ బీర్ బాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. రణ్ బీర్ హీరోగా తెరకెక్కిన "షంషేరా ", "బ్రహ్మాస్త్ర పార్ట్ 1 " మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరొక బాలీవుడ్ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన రణ్ బీర్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న "యానిమల్" మూవీ లో నటిస్తున్నారు.

మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీస్ రిఫరెన్స్ లతో "థ్యాంక్యూ "
“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగచైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరిస్తూ విజయం సాధిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థ్యాంక్యూ” మూవీ జూలై 22 వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా , అవికాగోర్ , మాళవిక నాయర్ కథానాయికలు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

"మాచర్ల నియోజకవర్గం"కృతి శెట్టి స్టైలిష్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్ ,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ ఆగస్ట్ 12వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. హీరోయిన్ అంజలి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ పోస్టర్‌లు, గ్లింప్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

11 మిలియన్ వ్యూస్ తో "రామారావు ఆన్ డ్యూటీ " ట్రైలర్ రికార్డ్
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ జులై 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటించి టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అఖిల్ "ఏజెంట్ "మూవీ టీజర్ పై మహేష్ బాబు స్పందన
ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హిప్ హప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ఉన్నతమైన సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న“ఏజెంట్” మూవీ నెల్లూరు, విశాఖపట్నం పోర్ట్ లలో , హైదరాబాద్ , యూరోప్ లోని బుడాపెస్ట్, మనాలిలో షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకుంది.

'మాచర్ల నియోజకవర్గం' నితిన్ డబ్బింగ్ స్టార్ట్..!
నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'మాచర్ల నియోజకవర్గం'. రాజకీయాంశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో ఇంతకుముందెన్నడూ చేయని పాత్రలో నితిన్ మొదటిసారి నటిస్తున్నాడు. ఈ మూవీలో సిద్దార్ధ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా పాత్రలో నితిన్ కనిపించనున్నాడు. ఈమధ్యే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో మొదలుపెట్టరు. ఈసినిమా నుండి వరుసగా పోస్టర్లు ఈమద్య పాటలు కూడా వరుసగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన స్పెషల్ సాంగ్ రా రా రెడ్డి ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్…

'రామారావు ఆన్ డ్యూటీ' ట్రైలర్ రిలీజ్
క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు రవితేజ. అయితే ఆ తరువాత వచ్చిన ఖిలాడి సినిమా మాత్రం మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఆశలన్నీ రామారావు ఆన్ డ్యూటీ పైనే ఉన్నాయి. శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమాలో మొదటిసారి రవితేజ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు కానీ, పాటలు, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ ను బట్టి పిల్లలు కిడ్నాప్ అయ్యే ఇన్సిడెంట్‌తోనే సినిమా కథ ఉండబోతున్నట్టు కనిపిస్తుంది. రవితేజ మరోసారి తన ఎనర్జిటిక్…

అఫీషియల్.. మెగాస్టార్ తో మాస్ మహారాజా..!
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గానే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న సినిమాలను ముగించే పనిలో బిజీగా ఉన్నారు. మెహన్ రాజా తో గాడ్ ఫాదర్ అలానే మెహర్ రమేష్ తో భోళా శంకర్ ఇంకా బాబి తో మరో సినిమా చేస్తున్నాడు. మూడు సినిమాకూడా సెట్స్ పైనే ఉన్నాయి. వీటిలో బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదన్న సంగతి తెలిసిందే కదా. మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది.

విజయ్ ఆంటోనీ "హత్య" మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్
యాక్టర్ , మ్యూజిక్ డైరెక్టర్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ గా పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్ అంటోనీ పలు సూపర్ హాట్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. విభిన్నమైన కథలు, పాత్రలతో అలరించే తమిళ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ ఇప్పుడు యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

"బ్రహ్మాస్త్ర " కేసరియా సాంగ్ రిలీజ్ డేట్
స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ"బ్రహ్మాస్త్ర " హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటిస్తుండగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటిస్తున్నారు. ప్రీతం సంగీతం అందిస్తున్నారు.

అమీర్ ఖాన్ కు ధన్యవాదాలు - చిరంజీవి
వయాకామ్ 18 స్టూడీయోస్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ , నాగచైతన్య , మోనా సింగ్ ప్రధాన పాత్రలలో హాలీవుడ్ సినిమా "ఫారెస్ట్ గంప్" కు రీమేక్‌గా తెరకెక్కిన కామెడీ డ్రామా "లాల్ సింగ్ చద్దా" హిందీ మూవీ ఆగస్ట్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తో టాలీవుడ్ హీరో నాగ చైతన్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ప్రీతమ్ సంగీతం అందించగా తనూజ్ టికు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

23 ఏళ్ల 'తమ్ముడు'.. రమణ గోగుల స్వీట్ మెమరీస్..!
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని పవర్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కు ఫ్యాన్స్ ఉండరు భక్తులు ఉంటారు అన్నంత రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. దానికి కారణం ఆయన చేసిన సినిమాలు, ఆయన నటన, స్టైల్, స్వాగ్ ఇలా అన్ని అప్పట్లో యూత్ ను మెస్మరైజ్ చేశాయి. ముఖ్యంగా తన కెరీర్ లో వచ్చిన తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలు అయితే పవన్ కు ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చిపెట్టాయి. పవన్ సినీ కెరీర్ లో ఈసినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆయన సినిమాల్లోని పాటల సంగతి అయితే…

'ఎఫ్ 3' సక్సెస్.. అనిల్ రావిపూడి థ్యాంక్స్ నోట్..!
టాలీవుడ్ లో ఉన్న దర్శకుల్లో ఇప్పటివరకూ ఫ్లాప్ అందుకోని డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో అనిల్ రావిపూడి పేరు కూడా ఉంటుంది. పటాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ ఆరు సినిమాలు చేశాడు. ఆరు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందించాయి. ఇటీవలే ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 తీసి మంచి హిట్ ను అందుకున్నాడు. ఈసినిమా రిలీజ్ కు చాలా టైమ్ పట్టింది. ఎప్పుడో ఈసీక్వెల్ సెట్స్ పైకి వెళ్లినా ఆతరువాత కరోనా వల్ల కొద్ది రోజులు లేట్ అవ్వడం.. తరువాత యూనిట్ సభ్యులే కరోనాకు గురవ్వడం.. ఇలా పలుమార్లు బ్రేకులు పడ్డాయి. ఇక రిలీజ్ సమయంలో కూడా చాలా సార్లు వాయిదా పడింది…

హీరో, విలన్ ఏ క్యారెక్టర్ అయినా సౌకర్యవంతంగానే ఉంటుంది - ఆది పినిశెట్టి
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ జూలై 14 వ తేదీ రిలీజ్ అయ్యి విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన “ది వారియర్”మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.డాక్టర్గా, పోలీస్గా, లవర్గా రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఆర్జే విజిల్ మహాలక్షిగా నటించిన కృతిశెట్టి తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్…