‘లైగర్’ ట్రైలర్ లాంచ్ అప్ డేట్..!

Liger Trailer Launch Update, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Liger Trailer Launch Date, Vijay Deverakonda, Vijay Deverakonda Liger Trailer Launch Update, Liger Trailer, Liger Trailer Launch Update, Liger Theatrical Trailer Launch Date, Vijay Deverakonda New Movie, Liger Movie Trailer Launch Event, Liger Movie Trailer, Liger Telugu Movie Updates, Vijay Deverakonda Liger Trailer, Ananya Panday

పూరీజగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ సినిమా లైగర్. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మొదటి నుండీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పోస్టర్లు , ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా అవి భారీ బజ్ ని క్రియేట్ చేశాయి. ఇప్పుడు ట్రైలర్ తో తుఫాన్ ని సృష్టించడానికి రెడీ అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం మేకర్స్ తన సినిమా ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. అప్ డేట్స్ కూడా అలానే ఇస్తున్నారు. ఈనేపథ్యంలో లైగర్ టీమ్ కూడా ట్రైలర్ లాంచ్ గురించి అప్ డేట్ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్, ఛార్మీ కౌర్ తో పాటు టీమ్ మెంబర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురించి చర్చిస్తున్న వీడియోని ఈ సందర్భంగా విడుదల చేశారు. ఛార్మీ రెండు ఈవెంట్‌లను నిర్వహించాలని అంటుంది.. దానికి కరణ్ ఓకే చెబుతాడు. మరోవైపు ట్రైలర్ తుఫాను సృష్టించబోతోందని విజయ్ అంటాడు. ఇక రెండు ప్రధాన నగరాల్లో ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తుండగా.. హైదరాబాద్ ఈవెంట్ ఆర్ టీ సి క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్‌లో ఉదయం 9:30 గంటలకు జరుగుతుంది. ముంబై లో ఈ ఈవెంట్ అంధేరిలోని సినీపోలిస్‌లో సాయంత్రం 7:30 గంటలకు జరుగుతుంది.

కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు ఇంకా రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను పలు పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఆగష్ట్ 25న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.