“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగచైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరిస్తూ విజయం సాధిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థ్యాంక్యూ” మూవీ జూలై 22 వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా , అవికాగోర్ , మాళవిక నాయర్ కథానాయికలు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“థ్యాంక్యూ ” మూవీ లో హీరో నాగచైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానిగా నటించిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు రైటర్ బీవీఎస్ రవి సోషల్ మీడియా ద్వారా గుడ్ న్యూస్ అందించారు. “థ్యాంక్యూ ” మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీస్ “ఒక్కడు”, “పోకిరి”, “దూకుడు” మూవీస్ రిఫరెన్స్ లతో తెరకెక్కిందని రైటర్ రవి ట్వీట్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: