బర్త్ డే విషెస్ చెప్పిన అందరికీ థ్యాంక్స్ -కిరణ్ అబ్బవరం

Young Hero Kiran Abbavaram Gets Emotional, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Hero Kiran Abbavaram, Kiran Abbavaram Upcoming Movie, Hero Kiran Abbavaram Latest News, Kiran Abbavaram New Movie Update, Kiran Abbavaram Says Thanks to everyone who sent birthday wishes, Kiran Abbavaram birthday wishes, Kiran Abbavaram Gets Emotional About birthday wishes

షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టిన కిరణ్ అబ్బవరం.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తొలి సినిమా “రాజావారు రాణిగారు” తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.”ఎస్ఆర్ కల్యాణ మండపం” చిత్రంతో కమర్షియల్ సక్సెస్ సాధించారు. కిరణ్ హీరోగా తెరకెక్కిన “సెబాస్టియన్ PC524”, “సమ్మతమే ” మూవీస్ పరాజయం పొందాయి. రెండు బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ వచ్చినా కూడా కిరణ్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి.గీతా ఆర్ట్స్ – మైత్రీ మూవీ మేకర్స్ – మెగా సూర్య మూవీస్ వంటి టాలీవుడ్ లోని పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కిరణ్ అబ్బవరంతో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పారితోషికం కావాలని డిమాండ్ , అడ్వాన్సు కావాలని అడగక పోవడం , ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకూ అన్ని విషయాలు తనే దగ్గరుండి చూసుకొనడం , నిర్మాతలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చేయడం తో కిరణ్ తో సినిమాలు చేయడానికి బడా నిర్మాణ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని సమాచారం. కిరణ్ హీరోగా తెరకెక్కిన “నేను మీకు బాగా కావాల్సిన వాడిని” సినిమా సెప్టెంబర్ లో విడుదల కానుంది. ఇదే క్రమంలో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ‘రూల్స్ రంజన్’ ‘మీటర్’ సినిమాలు రానున్నాయి. హీరో కిరణ్ తన బర్త్ డే కు విషెస్ చెప్పిన వారందరికీ థ్యాంక్స్ చెబుతూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రతీ సినిమాకు హార్డ్ వర్క్ చేసి మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తాననీ , ఇన్ని అవకాశాలు తనకు రావడం తన హార్డ్ వర్క్ వల్లే ననీ , తన పనిని ఇష్టం గా చేస్తున్నాననీ ఇన్ స్టా గ్రామ్ లో కిరణ్ పోస్ట్ పెట్టారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + six =